Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భధారణ సమయంలో ఎసిడిటి, జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే ఆ సమస్యలను అది నివారిస్తుంది. హైలెవల్ హార్మోన్స్ వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే.. అది శరీరంను శుభ్రం చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరిచి.. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.
- కడుపులో బిడ్డ పెరిగే కొద్ది బ్లడ్ వెజల్స్లో రక్తం ప్రసరణ తగ్గుతుంది. దాంతో కాళ్ళు, చేతుల్లో వాపులు మెదలవుతాయి. అలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే మంచిది.
- 'డీహైడ్రేషన్'కు గురి అయితే.. ప్రీమెచ్చుర్ బర్త్, యూట్రస్ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలబారి నుంచి ఉపశమనం పొందాలంటే.. పుచ్చకాయ తీసుకోవడం ఉత్తమం.
- గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల బరువు పెరుగుతంది. తద్వారా మజిల్ క్రాంప్, ఎముకల్లో నొప్పి మొదలువుతుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ తీసుకుంటే.. అందులో వుండే పొటాషియం, మెగ్నీషియం నొప్పులకు బాగా పనిచేస్తాయి.