Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది వాటికి విశ్రాంతి. ప్రతిరోజు 7 నుంచి 9 గంటలవరకు నిద్రపోతే కండ్లలో ఎటువంటి మంట వుండక... చాలా హాయిగా అనిపిస్తాయి. కాబట్టి తగినంత సేపు వరకు నిద్రపోయి, ఉదయాన్నే లేచి మొహాన్ని, కండ్లను శుభ్రం చేసుకుంటే ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.
- పాలమీగడతో ప్రతిరోజు కండ్ల చుట్టూ మసాజ్ చేసుకుంటే.. నల్లని చారలు, ముడతలు తొలగిపోతాయి. మసాజ్ చేసేటప్పుడు కండ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఓ టీ స్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్‌ను కలిపి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కండ్లకు రాసుకుని అరగంట సేపు వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఉదయాన్నే చేసుకుంటే.. కండ్లలో ఆకర్షణీయమైన మార్పును గమనించవచ్చు.
- ఓ గ్లాసు నీటిలో ఉసిరిపొడిని వేసి రాత్రి మొత్తం బాగా నానబెట్టాలి. ఈ మిశ్రమంతో ఉదయాన్నే లేచి కండ్లను కడుక్కుంటే కండ్లలో వున్న నీరసత్వం తొలగిపోయి తాజాగా మెరుస్తాయి.
- తక్కువగా నిద్రపోవడం వల్లగానీ, ఎక్కువగా ఏడవటం వల్లగానీ, అలసటగా వున్నప్పుడుగానీ కండ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అటువంటి సమయంలో గుడ్డులో వుండే తెల్లసొనను కండ్లకు తగలకుండా అడుగుభాగాన జాగ్రత్తగా రాసుకోవాలి. కొద్దిసేపు తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే తాజాగా తయారవుతాయి.
ఇలా రకరకాల పద్ధతుల ద్వారా కండ్ల చుట్టూ వుండే చారలు, మచ్చలను పోగొట్టుకోవచ్చు. అలాగే కండ్లలో వుండే నీరసత్వాన్ని దూరం చేసి, తాజాగా ఉల్లాసంగా వుండవచ్చు.