Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో కార్యకలాపాలు నిర్వహించుకోవడంతోపాటు ఆఫీసు పనులు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. దీంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గి నీరసంగా మారిపోవడం, నొప్పులు, తలనొప్పి.. ఇలా ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యల్ని అధిగమించాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం! ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి తీసుకుంతే ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. శరీరానికి కావలసిన విటమిన్స్, న్యూట్రీషియన్స్, మినరల్స్ వంటివి వాటిలో పుష్కలంగా వుంటాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్ లలో ఫైబర్ అధిక మోతాదులో వుంటుంది. అది మలబద్దకం సమస్యల్ని నివారించడంలో కీలకపాత్ర వహిస్తుంది. జీర్ణక్రియను మరింత మెరుగ్గా చేస్తుంది. శరీరం అనీమియాకు గురికాకుండా చేస్తుంది. ఇలా ఎన్నోరకాల ఉపయోగాలు ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ లలో వుండే పోషకాల ద్వారా కలుగుతాయి. మరి.. ఏయే ఆహారంతో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా..
బాదం: ఇందులో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. ఇది హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. కాబట్టి.. పనిచేసే ఉద్యోగినులు ప్రతి రోజూ ఉదయం బాదం తింటే.. శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది.
జీడిపప్పు-డ్రై ఆఫ్రికాట్: ఈ రెండింటిలో కాపర్ పుష్కలంగా ఉంది. ఇది శరీరంలో ఐరన్ నిల్వచేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కండరాలు గ్రేట్‌గా పనిచేయడానికి దోహదపడుతుంది.
డేట్స్ అండ్ ఫిగ్స్: శరీరానికి అవసరం ఫైబర్ ఈ రెండూ అందిస్తాయి. ఇవి హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా నివారిస్తాయి. బరువును కంట్రోల్లో ఉంచడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపచడంలో గొప్పగా సహాయపడుతాయి.
వాల్ నట్స్: వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రెగెంట్ మహిళలకు చాలా గొప్పగా ఉపయోగపడుతాయి. పొట్టలో పెరిగే శిశువు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.
ఎండు ద్రాక్ష: దంతక్షయాన్ని దూరం చేయడంలో ఎండు ద్రాక్ష బాగా సహాయపడుతుంది. దంతాలు, కండ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ద్రాక్ష దోహదం చేస్తుంది.