Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా రోజూ వేల కొద్దీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఫంగస్... ముక్కు లేదా నోటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐతే... అందరిలోకీ ఇది రాదు. అత్యంత బలహీనంగా, ఏమాత్రం ఇమ్యూనిటీ పవర్ లేని వారికి మాత్రమే వస్తుంది. కొద్దిగా ఇమ్యూనిటీ ఉన్నా... ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు. మరి మనలో వ్యాధి నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు కదా. కాబట్టి... ఈ ఫంగస్ మన బాడీలోకి వచ్చినా ముందుగా కంటిపై దాడి చెయ్యకుండా... కంటిని కాపాడుకునే ఆహారం తినడం ద్వారా... దాన్ని అడ్డుకోవచ్చు. కండకలపే కాపాడుకోవచ్చు. ఆ ఆహారం ఏదో తెలుసుకుందాం.
- చేపలు కంటికి మేలు చేస్తాయి. ముఖ్యంగా సముద్ర చేపలైతే ఇంకా మంచిది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్... కంటిని కాపాడుతాయి.
- కంటిని కాపాడే ల్యుటెయిన్, జీజాంతిన్ట అనే యాంటీఆక్సిడెంట్లు గుడ్లలో ఉంటాయి. రోజూ 3 గుడ్ల దాకా తినవచ్చు. ఫ్రై చేయడం కంటే ఉడకబెట్టి తింటే పోషకాలు బాగా అందుతాయి.
- ఆకుకూరలు, పుల్లటి పండ్లు కంటిని కాపాడుతాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటికి, కంట్లోని కణాలకు రక్షణ కల్పిస్తాయి. కంటికి వ్యాధులు రాకుండా చేస్తాయి.
- పప్పులు, బద్దలు గింజలు వంటివి కంటికి మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తినాలి. వీటిలోని జింక్ కంటిని బాగా కాపాడుతుంది. కంటి చూపును దెబ్బతినకుండా చేస్తుంది.
- క్యారెట్లు సంవత్సరమంతా లభిస్తాయి. వీటిని డైరెక్టుగా కొరికి తినవచ్చు లేదా జ్యూస్ చేసుకొని పంచదార కలపకుండా తాగడం మేలు. కూర వండుకొని కూడా తినవచ్చు. డైరెక్టుగా తింటే ఎక్కువ పోషకాలు కంటికి అందుతాయి.
- నారింజ, బత్తాయి, కమలా, పప్పర పనస వంటి పండ్లలో సి విటమిన్ ఫుల్లుగా ఉంటుంది. ఇది వ్యాధులు రానివ్వదు. ఫంగస్లు, బ్యాక్టీరియాలు దరిచేరకుండా ఆపేస్తుంది. కాబట్టి ఇవి తప్పక తినాలి.
- బాదంపప్పులు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వీటిలో... ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటిని రక్షిస్తాయి.
- సబ్జా గింజలను సూపర్ ఫుడ్ అంటారు. వీటిలో కూడా ఒమేగా 3 ఉంటుంది. కాబట్టి రోజూ కొద్దిగా నానబెట్టి... ఓ వారం పాటూ తాగితే మంచిది.
ఇవి వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయి. ఒకవేళ సోకినా అది వెంటనే ముదిరిపోకుండా ఇవి బలంగా ఆపుతాయి.