Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా అమ్మాయిలు యుక్త వయసుకు రాగానే నెలసరి మొదలవుతుంది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తున్నట్లైతే ఆరోగ్యంగా ఉన్నారనే లెక్క.. ఇలా కాకపోతే కొంచెం సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అయితే చాలా మంది మహిళలు ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఎదుర్కొంటుంటారు. సహజంగా 30 ఏండ్లు దాటాక ఈ సమస్య అధికమవుతుంది. ఈ వయసులో మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఇది నెలసరిపై ప్రభావం చూపుతుంది. ప్రతి మహిళ జీవితంలో రుతు చక్రం ప్రత్యేకమైనది. ఇది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు.. హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఈ సమయంలో మహిళలు అనేక మార్పులను చూడవచ్చని డాక్లర్లు చెబుతున్నారు. అవేంటో పరిశీలిద్దాం.
హెవీ పీరియడ్స్: చాలా మంది మహిళలు 30 ఏండ్ల తర్వాత జనన నియంత్రణ మాత్రలు తీసుకోవడం మానేస్తారు. తద్వారా పీరియడ్స్ హెవీ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. జనన నియంత్రణ మాత్రలు పీరియడ్స్‌ను తేలికగా చేస్తాయి.
పీరియడ్స్ మిస్వవ్వడం: గర్భాధారణ సమయంలో మహిళల్లో రుతు చక్రం గతి తప్పుతుంది. పీరియడ్స్ ఒక్కోసారి వారం పదిరోజులు ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు రెండు రోజుల ముందు మొదలుకొని 10 రోజుల ముందే వచ్చేస్తుంది. ఇలా కాకుండా రెగ్యులర్‌గా నెలసరి రావాలంటే కొన్ని సహజమైన చిట్కాలను పాటించండి.
పెయిన్ఫుల్ పీరియడ్స్: చాలా మంది మహిళలు 30 ఏండ్ల వయసులో ఎండోమెట్రియోసిస్, గర్భాశయ ఫైబ్రాయిడ్లతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితులు స్త్రీ పీరియడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. ఫైబ్రాయిడ్లు బాధాకరమైన పీరియడ్స్‌కు దారితీస్తాయి. పీరియడ్స్ సమయంలో మీరు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.
హార్మోన్లలో మార్పులు: సహజంగా 30 ఏండ్ల వయసులో స్త్రీ శరీరం హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో కొంతమంది మహిళలు మూడ్ స్వింగ్స్, అవాంఛిత రోమాలు. చర్మంపై ఉండే జుట్టు రాలడం మొదలైన సమస్యలు వస్తాయి.
పీఎమ్ఎస్ లక్షణాలు పెరగవచ్చు: 30 ఏండ్లకి అడుగుపెట్టాక సీఎమ్ఎస్ లక్షణాలు పెరగడం ప్రారంభిస్తాయి. శరీరంలో ఈస్ట్రోజెన్ పడిపోవటం వల్ల ఇది జరుగుతుంది. పీఎమ్ఎస్ లక్షణాలు పెరగడం వల్ల అలసట, ఉబ్బరం, డిప్రెషన్, కంగారు, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, మూడ్ స్వింగ్ వంటి వాటితో బాధపడుతుంటారు.
హెల్తీ పీరియడ్స్ కోసం ఇలా చేయండి: జీవనశైలిలో మార్పులు పీరియడ్స్‌ను ప్రభావితం చేస్తాయని గుర్తించుకోవాలి. 30 ఏండ్ల వయసులో, మహిళ అనేక జీవనశైలి మార్పులకు లోనవుతుంది. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం తగ్గించడం, దినచర్యను మార్చడం వంటి చేస్తుంటారు. తద్వారా నెలసరిపై ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎక్కువ సమయం పని చేయడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా పీరియడ్స్ రావడానికి పోషకమైన ఆహారం తీసుకోవడం, సమయానికి తినడం, సరైన విశ్రాంతి తీసుకోవాలని గుర్తించుకోండి. అంతేకాక మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అవసరమైనప్పుడు వైద్యుడిని సంప్రదించండి.