Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది బరువు ఎక్కువ వున్నారని తెలియగానే ఆహారం తీసుకోవడం మానేస్తారు. బరువు పెరగకుండా వుండాలని డైటింగ్ లేదా కేవలం ఒకపూట తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. అలాకాకుండా మూడుపూటలా భోజనం తీసుకోవచ్చు. అయితే వాటిని తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తపడాలి.
- ప్రతిరోజూ తక్కువ మోతాదులో శక్తినిచ్చే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఇలా అల్పాహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాక, శరీరాకతి కూడా అదుపులో వుంటాయి.
- సాధ్యమైనంతవరకు ఉప్పువుండే పదార్థాలను తీసుకోవడం మానేయాలి. ఉప్పు శరీరంలో నీటిని, కొవ్వును నిల్వవుండే గుణాన్ని కలిగివుంటుంది. దీంతో బరువు పెరగడమే కాకుండా, చురుకుగా వుండలేకపోతారు. కాబట్టి ఉప్పు వాడకం తగ్గించుకోవాలి.
- లావుగా వున్నవారు జిమ్‌కు వెళ్లడం, ఇతర వ్యాయామాలు చేయడం చేస్తుంటారు. అయితే వాటితోపాటు ప్రతిరోజు నడక చాలా అవసరం. సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ప్రతిరోజూ నడిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే పరిగెత్తడం వల్ల శరీరంలో వుండే కొవ్వు చాలావరకు తగ్గిపోతుంది.
- ప్రతిరోజూ సాయంత్రం తాజాగా వుండే ఏదో ఒక ఆహారపదార్థాలను అంటే యాపిల్, అరటిపండు ఇంకా ఇతర పండ్లను తీసుకోవాలి.
- నిద్రవల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఎలా అంటే.. నిద్రపోవడం వల్ల కండరాలు అలసటపడి తేరుకుంటాయి. అలాగే శరీరంలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. దీంతో కొవ్వు పదార్థాలు తగ్గి, ఆరోగ్యంగా వుంటారు. క