Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఆఫీసు, ఇంటి పనుల్లో బిజీ అయిపోవడంతో వారికి విశ్రాంతి తీసుకునేంత సమయం దొరకదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే కూర్చొని వుండటం, తిరిగి ఇంటికిరాగానే ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం, మరికొందరు ఆఫీసు పని పూర్తవ్వలేదని ఆ పనిని ఇంట్లో చేసుకోవడం.. ఇలా బిజీగానే గడుపుతుంటారు. దీంతో వీరికి విశ్రాంతి లేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒళ్లునొప్పులు, మానసిక ఆవేదన, మైకంగా అనిపించడం, ఇంకా రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే విశ్రాంతి కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉ విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు, విశ్రాంతి వల్ల హార్ట్ రేట్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి శరీరానికి విశ్రాంతి అందివ్వడం మంచిది. ప్రతి రోజూ అలసిన శరీరానికి తగినంత విశ్రాంతిని అందివ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. ఒత్తిడి తగ్గించుకొన్నట్లైతే శరీర, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు వదులవుతాయి. ప్రతి రోజూ విశ్రాంతి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రతోపాటు ఒత్తిడిని సునాయాసంగా అధిగమించే తత్త్వం ఉంటే.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతేగాకుండా ఏకాగ్రత పెంచుకోవచ్చు.
- విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మనిషి తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల కోపాన్ని కూడా తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
- మైకంగా, తల తిరిగేలా అనిపిస్తే ఓ నిముషం కూర్చొని, ప్రశాంతంగా విశ్రాంతిగా తీసుకోవాలి. తలతిరగడం నివారించడానికి డీప్ బ్రీత్ తీసుకోవడం ఉత్తమ మార్గం. ఇది మెదడుకు కావల్సినంత ఆక్సిజన్‌ను అందిస్తుంది. దాంతో మైకం తగ్గుతుంది. అలాగే డీహైడ్రేషన్ కూడా తలతిరగడానికి ఓ ప్రధాన కారణం. ముఖ్యంగా వేసవి సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఇలాంటి అసమతౌల్య సమస్యను నివారించుకోవచ్చు. తద్వారా చురుగ్గా ఉండొచ్చు.
- తల తిరిగినట్టు అనిపిస్తే అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది బ్రెయిన్‌కు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అల్లం కూడా మైకం తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లాన్ని టీలో చేర్చి తీసుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇలాంటి లక్షణాలతో పోరాడుతుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. తగినంత ఎనర్జీని అందిస్తుంది. తలతిరగడం నివారించడానికి నిమ్మరసం సూపర్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.