Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం కరోనా రోగులకు బాదంపప్పును ఎక్కువగా తీసుకోమని సూచిస్తున్నారు కదా. ఇందులో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుందని వాడమంటున్నారు. బాదంపప్పు, లవంగాలు, సపోటాగింజలతో నెక్లెస్‌ను తయారుచేశాను. నేనీ మధ్య ఫుడ్ ఐటమ్స్‌తో నెక్లెస్‌లను చేసి అవగాహన కల్పించుటకు ప్రయత్నిస్తున్నాను. వీటిని తినడం వల్ల శరీరంలో చేరే వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి లభిస్తుంది. ఇది రోజేసి కుటుంబానికి చెందిన చెట్టు. బాదం పప్పులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, సోడియం ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇందులో పీచుపదార్థం 17.9గ్రా|| ఉంటుంది. దీని ఆకులు దీర్ఘ అండాకారంగా ఉంటాయి. వీటిని ఆహారపదార్థాలు పెట్టుకొని తినడానికి వాడతారు. దీని శాస్త్రీయనామము ''ఫ్రష్ట్రనస్ డల్సిస్''. పూలు తెలుపురంగులో ఉండి చివర్లు పింక్ రంగులో ఉంటాయి. తీపి, చేదు అని రెండు రకాల బాదం చెట్లు ఉంటాయి.