Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలంలో సపోటా పళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. మా అబ్బాయికి చాలా ఇష్టం. నేను సపోటా గింజల్ని ఏరి దాచిపెట్టాను. ఒకరోజు నెమలిని చేద్దామని తీశానా గింజలు సరిపోలేదు. సరే కొన్ని చింతగింజల్ని కలిపాను. అయినా నెమలి రూపొందలేదు. ఇంట్లో ఇంకేమున్నాయా అని వెదకగా మా సెయింట్ బెర్నార్డ్ కుక్క తినే పెడిగ్రీ గుర్తొచ్చింది. కుక్క అంటే దానికి కోపమొస్తుందేమో 'మైలో' అంటానండి. ఇన్ని రకాలు కలిపితే గానీ నెమలి రూపొందలేదు. నేను అనేక వ్యర్థ పదార్థాల్తో నెమళ్ళను తయారు చేశాను. ఆసుపత్రి వ్యర్థాలతో చేసిన నెమలి బొమ్మను నేను మా హాస్పిటల్ లోగోగా ఇప్పటి దాకా వాడుకున్నాను. ''హాస్పిటల్కు నెమలి బొమ్మ సూటవదు'' అని చాలామంది మిత్రులన్నారు. ఎందుకు సూట్ కాదు. మాది పిల్లలు వచ్చే ఆసుపత్రి. పిల్లలంతా రంగుల నెమలి ఫించాలు కట్టుకొని గంతులేసే వాళ్ళే కదా. అదీ గాక ఇక్కడ వారికి నచ్చే అనేక రంగు రంగుల బొమ్మలు వింత వింత గాథలు చెబుతూ ఉంటాయి. పిల్లల్ని మాయాప్రపంచంలోకి తీసుకెళ్తాము. సపోటా గింజలు, చింత గింజలు, పెడిగ్రీలతో తయారైన నెమలి ఎలాఉందో చూడండి.