Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి కార్డులతో అప్పుడప్పుడు కొన్ని సృజనాత్మకంగా తయారు చేస్తున్నాం కదా! ఈరోజు పెండ్లి కార్డులో చక్కగా సీతారాములు ఉన్నారు. సీతా స్వయంవర దృశ్యం ఉన్నది. ఒక పక్కగా విఘ్నధిపతి గణపతి ఉన్నాడు. మిగతా అంతా సెల్ఫ్ డిజైన్‌లో ఉన్నది. ఇప్పుడు సీతారాములకు మొదటగా రంగులు వేశాను. ఆ తర్వాత సెల్ప్ డిజైన్‌కు రంగులు దిద్దాను. సెల్ఫ్ డిజైన అంటే కేవలం ఎంబోజింగ్లో మాత్రమే ఉంది. దానిని చక్కగా రంగులు దిద్దాక ఎంత అందంగా తయారయిందో ఇంకా కొద్దిగా ఖళీగా ఉన్నట్టనిపించి రెండు లతల్ని వేశాను. మీరు ఈ కార్డును గమనించండి. కార్డును ఇచ్చిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు నేనిలా తయారుచేసి బహుమతిగా ఇచ్చినపుడు.