Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం దుకాణాల్లో నగలు కొన్నపుడు వారు వాటిని అందమైన పెట్టెల్లో పెట్టి ఇస్తారు. నగలు విరిగిపోకుండానూ, మెరుపు తగ్గకుండానూ భద్రంగా ఉంటాయి. కేవలం వాటిని అలాగే వాడుకుంటే ఎలా? మన క్రియేటివిటీని చూపించాలి కదా! ఈ మధ్య ఎంగేజ్మెంట్ రింగ్‌ను చాలా అలంకారం చేసి వాడు కుంటున్నారు. ఇంకోసారి అది కూడా చూపిస్తాను. నేను ఎప్పుడో ముత్యాల గాజులు కొనుక్కున్నాను. వాటిని మెరూన్ రంగు ప్లాస్టిక్ పెట్టెలో పెట్టి ఇచ్చారు. నేనిప్పుడు ఆ బాక్స్‌ను ముత్యాలతోనే తయారు చేయాలనుకున్నాను. నలుచదరంగా ఉన్న ఆ బాక్స్ మీద హాఫ్ పెరల్స్‌ను అతికించాను. మధ్యలో గోల్డ్‌కలర్ బీడ్స్‌ను అతికించాను. లోపల ఉన్నవి బంగారు ముత్యాల గాజులు అని తెలిసే విధంగా అలంకారం చేశాను. మీరూ ఇలాగే పగడాల నెక్లెస్‌కు, పచ్చల హారానికీ తగినట్టుగా అలంకరించుకోండి.