Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు ప్రజలకు కోవాగ్జిన్,కోవిషీల్డు, స్పుత్నిక్ వాక్సిన్ల కన్నా పవర్ఫుల్గా పని చేసే వాక్సిన్ ధైర్యం. ప్రస్తుతం బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, బ్లాక ఫంగస్ అనే కొత్త జబ్బు వస్తున్నది. అనే వివరాల కన్నా భరోసా టీకా, ధైర్యం టీకాలను ఇంజక్ట్ చేయాలి. చాలా టీవీ ఛానల్స్ ప్రముఖ డాక్టర్లను పిలిచి వాళ్ళ పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పిస్తున్నారు. దానివల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. అనుమానం, భయం తప్ప. డాక్టర్ల దగ్గరకు వెళ్ళే లోపల ఏం చేయాలి? ఏ సమయంలో వెళ్ళాలి అన్న విషయాలపై అవగాహన ఉంటే చాలు. అంతేగానీ వైద్యశాస్త్రంలో ఉన్న జబ్బు లక్షణాలూ, చికిత్స తెలుసుకుంటే టెన్షన్, యాంగ్జైటీ రావడం తప్ప ఫలితం తక్కువ ఉంటుంది. భయపడేవాళ్ళు ఈ విషయాలన్నీ విని లేనిపోయిన జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. అతిగా వైద్యశాస్త్రం తెలుసుకున్నా జరిగేదేమీ లేదు. ఇప్పటికే చాలామంది సొంత వైద్యాలు చేసుకుంటున్నారు. పారాసిటమాల్, యాంటీ బయాటిక్స్ వాడాలి అంటూ ఆసుపత్రికి వచ్చినా వాళ్ళే సలహాలు చెపుతున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో బొమ్మల్ని చేసుకోండి. ఇల్లును అందంగా మార్చుకోండి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్