Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గంటల కొద్దీ కంప్యూటర్స్ ముందు కూర్చోవడంతోపాటు కారు-మోటార్ సైకిల్స్ నడపడం, వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వంటి ద్వారా వెన్నునొప్పి సమస్య ఏర్పడుతుంది. ఈ వెన్నునొప్పికి కొన్ని ముఖ్య కారణాలు కూడా వున్నాయి. వెన్నుపాము మధ్యలో జెల్లీ, డిస్క్ అనే మదువైన పదార్థాలు వున్నాయి. కారు, బైక్ వంటివి నడిపినప్పుడు ఆ పదార్థాలు అదిరి, నరాలను నొక్కేసినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వెన్నునొప్పి ఏర్పడుతుంది. ఇంకా అధిక శారీరక శ్రమ, అధిక బరువును ఎత్తడం, ఎక్కువ దూరం నడవడం, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం ద్వారానూ వెన్నునొప్పి కలుగుతుంది. ఈనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే... కంప్యూటర్ల ముందు గంటలసేపు కూర్చోకుండా అప్పడప్పుడు కాస్త నడిస్తే మంచిది. కారు నడిపేటప్పుడు చిన్న దిండ్లను వాడటం మంచిది. నిద్రించేటప్పుడు బోల్తాపడుకుంటే ఎంతో సుఖాన్ని అనుభవిస్తారు. ఇక మహిళలకు హైహీల్స్ వేసుకునే అలవాటు వుంటుంది. ఇలా హైహీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి.. మహిళలు చాలావరకు హైహీల్స్ వేసుకోవడం మానేస్తే.. ఎంతో శ్రేయస్కరం. ఈ వెన్నునొప్పి నుంచి తక్షణమే విముక్తి పొందాలంటే కొన్ని ఉత్తమ చిట్కాలు అందుబాటులో వున్నాయి. వాటిని రెగ్యులర్ గా పాటిస్తే.. ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
- ఐదు వెల్లుల్లి పాయలు తీసుకుని, 50 గ్రాముల నువ్వుల నూనెలో వేసి బాగా వేయించాలి. అనంతరం కొద్దిసేపు ఆరనించి.. గోరువెచ్చగా వున్నప్పుడు వెన్నునొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే త్వరగా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పద్ధతిని రాత్రి పడుకునే ముందు చేస్తే మంచిది.
- ఒక పాత్రలో చింతపండు రసం తీసుకుని అందులో కాస్త ఉప్పు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని గ్యాస్ స్టౌవ్ పెట్టి పేస్టులా తయారయ్యే వరకు వేడి చేయాలి. అనంతరం కిందకు దించేసి.. గోరువెచ్చగా ఉన్నప్పుడే వెన్నుపై రాసుకోవాలి. ఇలా చేస్తే త్వరగా వెన్నునొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
- నువ్వు నూనెను కొద్దిగా తీసుకుని స్టౌవ్ మీద వేడి చేయాలి. అనంతరం కిందకు దించేసి ఈ వేడి నూనెలో కాస్త ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్నునొప్పి వున్న ప్రాంతంలో రాసి, మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే త్వరగా నొప్పి తగ్గుతుంది. మసాజ్ చాలా మదువుగా, సున్నితంగా చేయాలి.
- ఒక పాత్రలో కాస్త మునగాకు రసాన్ని తీసుకుని అందులో సమపాళ్లు పాలు చేర్చుకోవాలి. వెన్నునొప్పి ఎక్కువగా వున్న సందర్భంలో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి సమస్య ఏర్పడినప్పుడు.. ఆముదాన్ని వేడి చేసి పాదాలకు రాస్తే ఫలితం పొందుతారు.
- గ్రీన్ బనానా తీసుకుని మిక్సిలో గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన బనానాలో దానిమ్మ గింజల్ని, బెల్లం కలిపి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో దానిమ్మ గింజల్ని క్రంచీగా ఉండాలి. ఈ మిల్క్ షేక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.