Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంపాస్టర్ సిండ్రోమ్.... అంటే... నేను ఎదుటి వారితో పోటిపడగలనా... నా వల్ల అవుతుందా... నేను చేయలేనేమో... అని తమని తాము తాము తక్కువగా భావించడం. ఈ ఇంపాస్టర్ సిండ్రమ్ మగవారికంటే మహిళా నాయకుల్లోనే ఎక్కువగా కనబడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ఫలితంగానే మహిళలు తమ విజయాలను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు తమపై తాము నమ్మకం పెట్టుకోకపోతే ఎదుటివారు ఎప్పుడూ అణగదొక్కే ప్రయత్నం చేస్తూనే వుంటారు. మనల్ని మనం నమ్ముకోవడంపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. లేదంటే సిండ్రోమ్ మనల్ని మరింత కుంగదీస్తుందంటున్నాయి కొన్ని లెక్కలు. మరి ఆ అధ్యయన వివరాలేంటో మనమూ తెలుసుకుందాం...
35 ఏండ్ల సోనాలికి తను పని చేస్తున్న సంస్థలో ప్రమోషన్ వచ్చింది. ఆమె తన జట్టుకు నాయకత్వం వహిస్తున్నాను అని గుర్తుచేసుకున్నప్పుడు ఆశ్చర్యపోయింది. తన కల నిజమైంది.. సంవత్సరాల కషి.. ఎన్నో రాత్రులు అంకిత భావంతో పని చేసిన ఆమెకు ఈ కొత్త స్థానం సంపాదించడం ఓ వరంలా అనిపించింది. కానీ ఆమె ఆనందం ఎక్కువ కాలం నిలవలేకపోయింది... తన తోటి వారు ఆమె నిర్ణయాలు, ఆలోచనలను ప్రశ్నించడం, ఆమె అధికారాన్ని అణగదొక్కడం ప్రారంభించారు. నెమ్మదిగా సోనాలి తన గురించి తాను తక్కువ చేసుకోవడం ప్రారంభించింది.
నేను ఊహించలేదు
''కొన్ని నెలల కిందట దీన్ని నేను ఊహించలేకపోయాను. నా పనిలో తప్పు ఎక్కడ జరుగుతుందో అని ఆశ్చర్యపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో, ఎలా చేయవచ్చో నాకు తెలియదు. ఒకవేళ నా సీనియర్లు నా పనిని మెచ్చుకున్నట్టయితే నును దీనికి అర్హురాలిని అని గ్రహించేదాన్ని. ఈ విషయాలన్నీ నా టీం సభ్యులందరికీ తెలుసు'' అని ఆమె చెబుతుంది. ఆమె మాటలను బట్టి స్పష్టమంగా అర్థమవుతుంది సొనాలి భయంకరమైన 'ఇంపాస్టర్ సిండ్రోమ్'కు బాధితురాలు అని.
మీరూ సమస్యను ఎదుర్కొన్నారా?
మానసికంగా ఒకరి విజయానికి అర్హత, ఒకరి సొంత ప్రయత్నాలు, నైపుణ్యాల ఫలితంగా చట్టబద్ధంగా సాధించబడిందని నమ్మడానికి నిరంతర అసమర్థతగా మనల్ని ఈ సిండ్రోమ్ చూపిస్తుంది. అయితే దీనికి పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు ప్రభావితం అవుతున్నారని డేటా చెబుతోంది. ఫేస్బుక్ సీఈఓ షెరిల్ శాండ్‌బెర్గ్, యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా... ఇలా అనేక ఇతర మహిళా నాయకులు కూడా ఈ సిండ్రోమ్ గురించి మాట్లాడారు.
సాధారణ సమస్యగా...
గత అక్టోబర్‌లో కెపీఎమ్జీ అధ్యయనం ప్రకారం పరిశ్రమల్లో 75 శాతం మంది మహిళా అధికారులు తమ కెరీర్లో ఇంపాస్టర్ సిండ్రోమ్‌ను ఎదుర్కొన్నారు. వాస్తవానికి 750 మందిలో 85 శాతానికి పైగా మహిళలు ఇంపొస్టర్ సిండ్రోమ్ సాధారణంగా అనుభవించే విషయంగా భావిస్తున్నారు. మరోవైపు కార్యనిర్వాహక పాత్రలలో 74 శాతం మంది మహిళలు తమ మగ సహచరులు వారు చేసినంతవరకు స్వీయ-అనుమాన భావనలను అనుభవించరని కనుగొన్నారు. 81 శాతం మంది పురుషుల కంటే విఫలం కాకూడదని తమపై ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారని నమ్ముతారు.
వివక్ష ఎదుర్కొంటున్నారు
హెచ్బీఆర్ నివేదిక ప్రకారం మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని ప్రముఖ సైకాలజిస్ట్, లౌట్ రూమ్ థెరపీ వ్యవస్థాపకులు గారిమా జునేజా అంటున్నారు. మహిళలు తమ మగవారి కన్నా ఈ సిండ్రోమ్ అత్యంత ప్రమాదకారిగా భావిస్తున్నారని కూడా అంటున్నారు.
వంద శాతం అర్హత వున్నా...
ఎక్కువ మంది మహిళలు తమను తాము నిరూపించుకోవాలను కుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమని తాము నిరూపించుకోలేక మధ్యలోనే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు. వాస్తవానికి మహిళలు ఉద్యోగంలో చేరడానికి ముందే ఈ భావన మొదలవుతుంది. పురుషులు తమలో 60 శాతం మాత్రమే అర్హతలు ఉన్నా ధైర్యంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. కానీ మహిళలు తమకు వంద శాతం అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోవడానికి వెనకాడతారు. ఈ పోటీ ప్రపంచంలో మేము గెలవలేమేమో అనే భావన మహిళల్లో ఎక్కువగా ఉందని 2019 లింక్డ్ఇన్ నివేదికలో తేలింది.
ఎంతో పోరాడాలి
హెచ్బీఆర్ ప్రకారం మహిళలు తమ స్థాయిని, శక్తిని, ఆశయాలను ప్రదర్శించినప్పటికీ ఎంతో మందితో ఎన్నో విషయాలపై పోరాడాలి. గారిమా ఈ విషయంపై ఏమంటున్నారంటే మహిళలు ఎంతకష్టమైనా తమని తాము నిరూపించుకోవాలి.
అంతకు ముందులా వుండరు
ఈ సమస్య కేవలం మనతో పాటు పని చేసే ఉద్యోగుల నుండి మాత్రమే తలెత్తదు. అలాగే మనకు సహకరించే సహోద్యోగులు ఉండడంలేదు. నేను నాయకత్వ పదవిని చేపట్టడానికి ముందు నాతో స్నేహపూర్వకంగా, సహాయంగా ఉన్న వారే తర్వాత నాకు సహకరించడం మానేస్తారు. లేనిపోని నిందలు వేస్తుమంటారు. ఇది పురుషులు మాత్రమే కాదు, నా జట్టులోని మహిళలు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. మగవారైతే నేను పనిని అప్పగిస్తే వెంటనే ఒప్పుకోరు. అందుకే నేను వారి నమ్మకాన్ని పొందడానికి వివిధ మార్గాల్లో పని చేస్తాను. అనుకున్నదానికంటే ఎక్కువ పనిని తీసుకుంటాను. చాలా సార్లు నేను వారి పనిని కూడా పంచుకుంటాను.
- పవిత్ర, సీనియర్ ఎగ్జిక్యూటివ్
కఠినమైన నిర్ణయాలు
స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఈ సిండ్రోమ్‌ను ఎదుర్కోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా మహిళలు తమ స్థితిని నిరూపించుకోవడానికి ఎక్కువ కషి చేయాలని భావిస్తున్నారు. దాని కోసం వారు ఇటు ఇంటి పనిని, అటు కుటుంబాన్ని రెండింటినీ సమతుల్యం చేసుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో చాలా మంది మహిళలు ఉద్యోగాలను, బాధ్యతలను వదులుకోవల్సి వచ్చింది. దీనికి కారణం ''నూ పని చేయాల్సిన అవసరం లేదు. కుటుంబాన్ని పోషించాల్సిన ప్రాధమిక బాధ్యత నీది కాదు అనే మైండ్ సెట్ మగవారిలో ఉంది.