Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా వేసవి అంటే ఎండలు మండిపోతాయి. నిజంగా ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. ఇటువంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటం మంచిది. ముఖ్యంగా వేడిని తట్టుకునే ఆహారం తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ ఎండల నుండి సురక్షితంగా ఉండాలి. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా శరీరాన్ని చల్లబరచుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వేసవి అంటే చాలా మంది డిహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కేవలం లిక్విడ్స్ మాత్రమే కాదు చాలా రకాల ఆహార పదార్థాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ప్రతి రోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు కచ్చితంగా తాగాలి.
పుదీనా: పుదీనా మంచి సువాసనతో, ఫ్లేవర్‌తో వుంటుంది. దీనిని మనం విరివిగా వాడుతూనే ఉంటాం. ఏ వంటలో వేసినా దీని రుచి చాలా బాగుంటుంది. పుదీనా నిజంగా సమ్మర్లో బాగా ఉపయోగ పడుతుంది. ఇది రిఫ్రెష్‌గా కూడా ఉంచుతుంది. పైగా ఎన్నో రకాలుగా మీరు పుదీనాని ఉపయోగించుకోవచ్చు. పుదీనాతో చట్నీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లేదా మీరు డ్రింక్‌లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనాతో తయారు చేసిన డ్రింక్స్ తీసుకోవడం వల్ల దాహం కూడా తగ్గుతుంది. మిక్సీ జార్లో పుదీనా, నీళ్లు, కీరా దోస వేసి మిక్సీ చేసి ఆ డ్రింక్‌ని తీసుకోవచ్చు. పైగా పుదీనా సులువుగా ఇంట్లో పెరుగుతుంది. మీరు చిన్నచిన్న మొక్కలు ఇంట్లో కూడా వేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పుదీనా దొరుకుతుంది. ఇలా అప్పటికప్పుడు మీరు సమ్మర్లో పుదీనాతో డ్రింక్స్ తయారు చేసుకు తీసుకోవచ్చు లేదా మీకు నచ్చిన రెసిపీస్ మీరు ట్రై చేయొచ్చు ఎలా తీసుకున్న దీని వల్ల చక్కటి బెనిఫిట్ పొందొచ్చు.
ఉసిరి: ఉసిరి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు పురాతన కాలం నుండి ఉపయోగిస్తూనే ఉంటున్నాం. దీనిలో విటమిన్ సి సమద్ధిగా ఉంటుంది. ఇది మంచి కూలింగ్ ఎఫెక్ట్‌ను కూడా ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ సమస్యతో బాధ పడే వాళ్లకి కూడా ఉసిరి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది తగ్గిస్తుంది. మీరు మీ డైట్లో దీనిని తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. ఉసిరిని తీసుకోవడం కూడా చాలా సులువు. మీరు దీనితో పచ్చడి చేసుకుని తీసుకోవచ్చు లేదు అంటే ఉసిరిని డైరెక్టుగా కూడా తినవచ్చు. ఏది ఏమైనా చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి. ఆమ్లా మురబ్బా లాంటివి కూడా ట్రై చేయొచ్చు దీనిలో చాలా ఆహార పోషకాలు ఉన్నాయి. ఈ లాభాలని మీరు ఉసిరి ద్వారా పొందొచ్చు కాబట్టి వేసవిలో ఉసిరి ఎక్కువగా తీసుకోండ.ి దీనితో మీకు చక్కటి ప్రయోజనాలు ఉంటాయి.
గంధం చెక్క: గంధం చెక్క మనకు సులభంగా దొరుకుతుంది. దీనిలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మీ చర్మాన్ని చల్లగా ఉంచడంలో ఇది ఎంతగానో సహాయ పడుతుంది. గంధం చెక్కని అరగదీసి ఆ పేస్ట్‌ని మీరు చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం ఎంతో చల్లగా ఉంటుంది. దీనిలో మంచి కూలింగ్ గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు వేసవిలో దీనిని ఉపయోగించండి. తద్వారా మంచి ఫలితాలను పొందండి.