Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరిగి మళ్ళీ గత సంవత్సరం మనం ఎలా ఉన్నామో.. అలానే మరొక సారి అదే దుస్థితిలో ఇప్పుడు ఉంటున్నాం. వర్క్ ఫ్రమ్ హౌమ్ చేయడం, మనకి నచ్చిన వాళ్ళకి దూరంగా ఉండడం లాంటివి జరుగుతున్నాయి. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిజంగా మనం ప్రేమించిన వాళ్లకి దూరంగా ఉండటం.. కేవలం ఫోన్లు ఇంటర్నెట్లో దగ్గరగా ఉండడం కాస్త ఇబ్బందే. దీని ప్రభావం మనపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండడం ఒత్తిడిని, యాంగ్జైటీని తీసుకొస్తాయి. మానసికంగా కూడా ఎన్నో సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. వాళ్లకు దూరంగా ఉండడం వల్ల ఇలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఆలోచించకుండా, ఒత్తిడికి గురి కాకుండా, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఏది కంట్రోల్ చేసుకోగలమో
సమాధానాలు లేని ప్రశ్నలు మీద ఎంత ఆలోచించినా కూడా ఒత్తిడి వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రశ్నల కోసం మీరు ఏ విధంగా కూడా ఆలోచించవద్దు. అటువంటి వాటి కోసం సమాధానాలు వెతికినప్పుడు మనకు భయం వస్తుంది. దాంతో ఇతర పనులుపై ఫోకస్ చేయలేరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అందరినీ పట్టి పీడిస్తోంది. దీని నుంచి బయట పడటం ప్రతి ఒక్కరికి కష్టమై పోతుంది. అయితే పదే పదే ఈ మహమ్మారి గురించే ఆలోచిస్తూ ఉంటే ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకోండి. దానికి బదులు మీరు చక్కగా ఎక్కువ సేపు నిద్రపోండి. అదే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దాని వల్ల ఎటువంటి ఒత్తిడి రాదు. దీనితో మీరు చక్కగా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
అన్నీ చర్చించుకోండి
ఇటువంటి సమయంలో మీ పార్టనర్‌తో ఓపెన్‌గా ఉండండి. వాళ్ళతో మీరు ఆన్లైన్లో గడపడం వల్ల మీరు వాళ్ళతో కనెక్ట్ అయి ఉండచ్చు. అలానే వాళ్ళతో వున్నాను అనే భావన మీలో, వారిలో కూడా ఉంటుంది అంతే కానీ మీరు ఒత్తిడి కారణంగా కానీ మరి ఇంకా ఏదైనా కారణాల వల్ల కానీ వాళ్లతో సరిగ్గా కనెక్ట్ అయ్యి ఉండక పోతే వాళ్ళల్లో కూడా ఒత్తిడి పెరిగి పోతుంది. ఒకవేళ ఇలాంటి ఒత్తిడి సమయంలో వాళ్లతో కనెక్ట్ అయి ఉండలేకపోతుంటే వాళ్ళకి ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పండి. తిరిగి సమయం బాగున్నాక రీకనెక్ట్ అవుదామని ఓ మాట చెప్పండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
ఇతర విషయాలపై...
వీడియో చాట్ లాంటివి ఎన్నో వచ్చాయి. ఈ కరోనాలో ఒత్తిడి నుంచి మీరు బయట పడడానికి, మానసిక ఇబ్బందుల్ని మర్చిపోయి ఉండాలి అంటే ఇద్దరూ హార్ట్ ఫుల్‌గా మాట్లాడుకోండి. అంతే కానీ మీరు ఈ మహమ్మారిని తలుచుకుంటూ భయపడిపోకండి. మహమ్మారికి సంబంధించిన మాటలు అన్నీ పక్కన పెట్టేసి వేరే ఇతర విషయాలను మీరు మాట్లాడుకోండి.
మీకు నచ్చినంత సమయం...
కరోనా మహమ్మారి వల్ల చాలా సమయం మనకి దొరికింది. ఇటువంటి సమయంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ వర్క్ నుండి కాస్త దూరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు వర్చువల్‌గా మాట్లాడుకుని నచ్చిన వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోండి. దీంతో వాళ్ల మీద మీకు ఓ క్లారిటీ కూడా వచ్చేస్తుంది.
మీ పట్ల మీరు
మీరు ఏమేం పనులు చేస్తున్నారు, ఎటువంటి పనులు చేయడం వల్ల మీకు మంచిగా వుంది అనేది నోట్ చేసుకోండి. అదే విధంగా కరోనా గురించి ఆలోచించకుండా మీరు మీ పార్ట్నర్తో ఎక్కువ సమయాన్ని గడపండి. లేదా ఓ మంచి పుస్తకాన్ని చదువుకోండ.ి ఇవేమీ కాక పోతే వంట చేయడం. ఇంకా ఏవైనా కొత్తవి నేర్చుకోండి దీంతో మీరు ఒత్తిడి నుంచి దూరంగా ఉండడానికి వీలవుతుంది.
నమ్మకం కోల్పోవద్దు...
ఎప్పుడూ కూడా మీ పైన మీకు నమ్మకం ఎక్కువగా ఉండాలి. మీ పైన మీకు నమ్మకం ఉంటేనే ఏదైనా చేయగలరు. రిలేషన్ షిప్‌లోకి వచ్చేసరికి ఎక్కువ మందితో మాట్లాడటం మీకు వాళ్ళు సూట్ అవుతారా లేదా అనేది అందరిని అడగడం ఇలాంటివి చేయకండి. మీ నిర్ణయం మీరు తీసుకోండి. అదే విధంగా నమ్మకాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు. అలా ఉండడమే మంచిది.