Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో వేడి ప్రభావంతో చర్మం దెబ్బతింటుంది. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలు ముఖ్యంగా చర్మానికి, శరీరానికి మంచిది. నిమ్మకాయలు అధికంగా తీసుకోవడం వల్ల మనం శరీరాన్నికాపాడుకోవచ్చు.
క పొడి చర్మానికి నిమ్మ, తేనె అద్భుతంగా పని చేస్తాయి. ఓ టీస్పూన్ తేనెకు నిమ్మరసం వేసి ముఖం, మెడపై రాయండి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేయండి. అనంతరం మీ చర్మంలో తేడాను మీరు గమనించవచ్చు.
- నిమ్మకాయ, బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా చర్మపు మచ్చలను శుభ్రపరచడానికి, మృత కణాలను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి మోచేతులు, మోకాలు, చంకలు, మెడ తదితర ప్రాంతాల్లోని నల్ల మచ్చలపై రాయండి. 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి.
- నిమ్మకాయ, కాఫీ.. కాఫీ పౌడర్లో యాంటీఆక్సిడెంట్, ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మపై ఉండే మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాఫీలో కొద్దిగా నిమ్మరసం వేసి ముఖానికి రాయండి. తేలికగా మసాజ్ చేసి ముఖం కడుక్కోండి.