Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెత్త(క్లట్టర్) అంటే అంటే చాలామంది కంటికి కనిపించేదే అనుకుంటారు. దీన్ని ఫిజికల్ క్లట్టర్ అంటారు. ఇది మాత్రమే కాదు ఇంకా ఎమోషనల్ క్లట్టర్, డిజిటల్ క్లట్టర్ కూడా ఉన్నాయి. మన లోపలే అణిచేసుకున్న కోపాలు, చిరాకులు, బయటకి చెప్పుకోలేని బాధలు, అపజయాలు, అవమానాలు... ఇవన్నీ కూడా పనికి రాని చెత్తే. ఫిజికల్ క్లట్టర్ మన ఇంట్లో స్థలాన్ని ఆక్రమిస్తే ఎమోషనల్ క్లట్టర్ మన మెదడుని ఆక్రమిస్తుంది. ఈ చిరాకులే మన నిండా ఉంటే ఇక ప్రశాంతంగా, హాయిగా ఎలా ఉంటుంది. ఇవే కాక డిజిటల్ చెత్త కూడా ఒకటి ఉంది. ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీ బ్రౌజర్లో ఇంకో పదో పదిహేనో ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయనుకోండి అదే డిజిటల్ క్లట్టర్. ఓపెన్ చేసి ఉన్న ఈమెయిల్స్, ఫోటోలు, డాక్యుమెంట్స్, బోలెడన్ని ఫైల్స్, డిలీట్ చేద్దాంలే అనుకుంటూ కూడా డిలీట్ చేయని ఫైల్స్, డాక్యుమెంట్స్.. ఇవన్నీ డిజిటల్ క్లట్టర్ కిందకే వస్తాయి. మరి వీటన్నింటినీ వదిలించుకోవడం ఎలాగో చూద్దాం...
మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది?
- పేరుకుపోయిన చెత్త వల్ల వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది.
- ప్రశాంతంగా ఉండే వాతావరణంతో పోలిస్తే క్లట్టర్ ఎక్కువగా ఉన్న వాతావరణంలో అన్‌హెల్దీ ఫుడ్ తీసుకునే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
- క్లట్టర్ ఎక్కువయిపోయిన ఇళ్ళల్లో దుమ్ము, ధూళీ కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంత మందికి వీటి వల్ల ఎలర్జీలు కలిగే అవకాశం కూడా ఉంది.
- ఇతరులతో మన రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి.
- అది మనల్ని ఒంటరిని చేసేస్తుంది.
- ఆర్ధిక ప్రణాళిక అస్తవ్యస్తమయిపోతుంది.
- క్రియేటివిటీ దెబ్బ తింటుంది, వర్క్ సరిగా చేయలేరు.
- నెగెటివ్ ఫీలింగ్స్ ఎక్కువయిపోతాయి.
- టైమ్ అంతా ఏది ఎక్కడుందో వెతుక్కోవడానికే సరిపోతుంది.
- ఏదీ మీ కంట్రోల్లో లేదన్న ఫీలింగ్ పెరిగిపోతుంది.
ఇన్ని చిరాకులు తెచ్చిపెట్టే చెత్తని వదిలించుకోవడం, మళ్ళీ చేరకుండా చూసుకోవడం వల్ల దైనందిన జీవితం సౌకర్యంగా ఉంటుంది.
కంటికి చనిపించేది
- పెద్ద పెద్ద అట్ట పెట్టెలు కానీ, బుట్టలు కానీ, ప్లాస్టిక్ టబ్స్ కానీ రెడీగా పెట్టుకోండి. అసలు అవసరం లేని వాటిని తీసేయచ్చు. ఉండాలి కానీ ఆ ప్లేస్‌లో కాదు అనుకునే వాటిని వీటిలో వేస్తే సరిపోతుంది.
- ఓ చిన్న ఏరియాతో మొదలు పెట్టండి. అంటే టీవీ క్యాబినెట్ లాంటిది. ముందు ఆ ప్లేస్ క్లియర్ చేయండి. ఆ ప్లేస్‌లో అక్కరలేదు అనుకున్న వాటిని మీరు రెడీగా పెట్టుకున్న బుట్టలో వేసేయండి.
- పది నిమిషాలు లేదా పావు గంటకి టైమర్ సెట్ చేసుకోండి. ఆ టైమ్‌లో ఎంత పని అయితే అంతే చేయండి.
- మీరు క్లియర్ చేసిన ఏరియాలో మళ్ళీ క్లట్టర్ చేరకుండా చూసుకోండి. ఇలా ఇల్లు మొత్తం క్లియర్ చేసుకుంటూ రండి.
- ఇలా క్లియర్ చేసేప్పుడు సెంటిమెంటల్ ఐటెమ్స్‌తో మాత్రం స్టార్ట్ చేయకండి.
- ప్రతి వస్తువుకీ ఓ ప్లేస్, ఆ ప్లేస్లోనే ఆ వస్తువు అన్న ఫిలాసఫీని మనసా వాచా కర్మణా ఫాలో అయిపోండి.
- ఉన్న ప్లేస్ చాలకపోతే ఆర్గనైజ్ చేయడానికి వీలుగా ఉన్న వస్తువులు తెచ్చుకోండి.
- ఈ ప్రోగ్రామ్ ఇంట్లో అందరూ చేయాలని గుర్తు పెట్టుకోండి. ఓ పక్క మీరు క్లియర్ చేస్తూ ఇంకో పక్క ఇంకొకరు మళ్ళీ క్లట్టర్ చేరుస్తూ ఉంటే కష్టం కదా.
- కండ్లు మూసుకుని మీ ఇల్లు ఎలా ఉంటే బావుంటుందో ఊహించండి. ఈ ఊహలో చిన్న చిన్న స్పేసెస్ కూడా రావాలి. ఆ ఊహని నిజం చేయండి.
- అవసరమనుకుంటే మీ ఫ్రెండ్ సహాయం తీసుకోండి.
లిడిజిటల్ క్లట్టర్ని...
- మీ ఈమెయిల్స్‌కి వెంటనే రిప్లై ఇచ్చేయండి. వెంటనే ఇవ్వడం కుదరని వాటిని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోకి పంపించండి.
- అక్కర్లేని మెయిల్స్‌ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి.
- డాక్యుమెంట్స్ ఫోల్డర్ని క్లీన్ చేయండి. ఒక వేళ అవసరపడతాయేమో అని డౌట్ ఉన్న వాటిని ఆర్కైవ్ చేయండి.
- వాడని ప్రోగ్రామ్స్, యాప్స్ డిలీట్ చేసేయండి.
- మీ ఫోల్డర్స్కి సరైన టైటిల్స్ ఇవ్వండి. అప్పుడు మీరు ఏ ఫోల్డర్లో ఏముందో వెతుక్కోనక్కరలేకుండా సరిపోతుంది.
- మీరు చూడని సినిమాలు, పాటలు తీసేయండి.
- అక్కర్లేని ఫొటోస్ డిలీట్ చేసేయండి.
- ఫేస్ బుక్, ట్విట్టర్లో ఎంత తక్కువ సమయం గడపగలిగితే అంత మంచిది. మీ ఫ్యామిలీ మీకు సైలెంట్‌గా థాంక్స్ చెబుతుంది.
- కాంటాక్ట్ ఇంఫర్మేషన్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి.
- రెండు కంటే ఎక్కువ ఈమెయిల్ ఎకౌంట్స్ ఆపరేట్ చేయకండి.
ఎమోషనల్ క్లట్టర్ని...
- కొన్ని ఫీలింగ్స్ వదిలేయండి, కొన్నింటిని మర్చిపోండి. రెండూ కుదరదు అనుకున్నప్పుడు క్షమించేయండి.
- నో చెప్పడం నేర్చుకోండి.
- ఫ్రెండ్స్, పరిచయస్తులని ఒకే గాటన కట్టకండి.
- మీకు నచ్చే, మీకు ఆనందాన్నిచ్చే పనులు చేస్తూ ఉంటే మీకు నచ్చని, బాధని కలిగించే ఆలోచనలు వాటంతట అవే పక్కకి తప్పుకుంటాయి.
- బాగా బాధగా అనిపించే విషయాలని ఓ చోట కూర్చుని పేపర్ మీద పెట్టండి. తర్వాత ఆ పేపర్ని ముక్కలుగా చేసి పారేయండి.
- మీ జీవితం ఎలా ఉంటే బావుంటుందో ఊహించండి. ఆ ఊహ నిజం కావాలంటే కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అవి ప్రాక్టికల్ అవునా కాదో చెక్ చేసుకుని ఆ ప్రకారం చేయండి.
- మీకు బాగా ఆప్తులు, మీరు నమ్మవచ్చు అనుకున్న వ్యక్తితో - వీరు మీ ఫ్రెండ్ కావచ్చు, కుటుంబంలో సభ్యులు కావొచ్చు, బంధువు కావొచ్చు. మీ బాధని కష్టాన్ని పంచుకోండి. పంచుకుంటే తప్ప కష్టం కరగదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
- ఎవరితోనూ ఎలాంటి కంపేరిజన్స్ పెట్టుకోకండి... మంచైనా చెడైనా. ఈ జీవితం మీది. ఇంకొకరితో పోలిక అనవసరం.
కొన్ని విషయాలని గతం గతహ అని వదిలేయండి.
- ప్రస్తుతంలో జీవించడం నేర్చుకోండి.. అలవాటు చేసుకోండి.
ఈ టిప్స్ పాటించండి.. మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే చూడండి.