Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెకండ్‌వేవ్‌లో కరోనా కాటును చూస్తూనే ఉన్నాం. రోజూ వేల మంది ఆస్పత్రుల పాలై ఊపిరి అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్లకు లక్షల్లో ఖర్చవుతోంది. అయినా ప్రాణాలు దక్కట్లేదు. అందుకే... కాస్త రోజువారీ ఖర్చులు పెరిగినా పర్లేదనుకుంటూ.... ఆరోగ్యం పెంచుకోవడానికి మనం ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరమే. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కాలకు పెద్దగా ఖర్చు కాదు. పైగా... ఈ చిట్కాలతో ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి. కరోనా లాంటివి సోకినా వైరస్ లంగ్స్‌ని ఎక్కువగా దెబ్బతియ్యలేదు. అందుకోసం ఈ హౌమ్ మేడ్ డ్రింక్స్ చేసుకొని తాగాలి.
- తేనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో వేడిని బాగా తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో చెడు వ్యర్థాలను తరిమేస్తాయి. రోజూ గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూన్ తేనె వేసుకొని తాగేయండి.
- పాలతో చేసిన టీ తాగేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే దాని కంటే గ్రీన్ టీ తాగితే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. ప్రతి రోజూ ఉదయాన్నే ఓ కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే బాడీకి యాంటీ-ఆక్సిడెంట్స్ బాగా అందుతాయి. ఇవి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతాయి.
- ఓ కప్పు నీటిలో 2 యాలకులు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 10 నిమిషాలు వేడి చేసి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. ఇది ఊపిరి తిత్తులకు కూడా మేలు చేస్తుంది.
- అల్లం టీలో కొద్దిగా పసుపు వేసుకొని తాగాలి. లేదా వేడిపాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగాలి. ఇది జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఊపిరి తిత్తులకు గాలి బాగా వెళ్లేలా చేస్తుంది. ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి.
- సగం యాపిల్, చిన్న బీట్ రూట్ ముక్క, ఓ క్యారెట్ ముక్కలు చేసి, మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్‌లా తాగాలి. వీటిలోని విటమిన్ సీ, ఈ, పొటాషియం ఆస్తమా, జలుబును తగ్గిస్తాయి.
- పుదీనా ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని తాగితే గొంతులో మంట, గరగర వంటివి పోయి గొంతు చల్లగా అవుతుంది. రిలీఫ్ లభిస్తుంది. ఇది ఊపిరి తిత్తులకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది.