Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మహమ్మారి సమయంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవడం మంచిది. మంచి జీవన విధానాన్ని అనుసరించడంలాంటి పద్ధతులు పాటించాలి. ప్రతి రోజు తల్లికి కూడా ఎంతో పని ఉంటుంది. రోజు వంట చేయడం నుండి ఎన్నో పనులు ఉంటాయి. అమ్మ తప్పకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇంటి పని, ఆఫీసు పనులు ఇలా ఎన్నో పనులు కారణంగా ఆహారం మీద దష్టి ఎక్కువగా పెట్టలేరు తల్లులు. కానీ అలా చేయడం తప్పు. ప్రతి రోజు వీలైనంత పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. అయితే మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి...? ఎలాంటి పోషక పదార్థాలు అవసరమో తెలుసుకుందాం.
కాల్షియం, విటమిన్ డి: డైట్లో తప్పకుండా కాల్షియం ఉండాలి. ఆరోగ్యకరమైన ఎముకల కోసం కాల్షియం చాలా అవసరం. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రావు. డైరీ ప్రొడక్ట్స్, బచ్చలి కూర, సోయా బీన్స్, కమలారసం, ఓట్ మీల్లో ఇవి పుష్కలంగా వుంటాయి.
ప్రోటీన్స్: ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్లో తీసుకుంటూ ఉండాలి. బోన్ డెన్సిటీ, మజిల్స్‌కి ప్రోటీన్స్ చాలా అవసరం. అదే విధంగా బీన్స్, గుడ్లు, పల్లీలు వంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. వాటితో పాటుగా నట్స్ వంటివి కూడా తీసుకుంటూ ఉండాలి.
పండ్లు, కూరగాయలు: డైట్లో కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవడం మంచిది. ఇవి అనేక రకాల సమస్యలను దూరం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి. సీజన్లో వచ్చే పండ్లు, కూరగాయలు కూడా తీసుకుంటూ ఉండాలి.
పొటాషియం: పొటాషియం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే విధంగా సాల్ట్‌ని తగ్గిస్తూ ఉండాలి. సాల్ట్‌ని తక్కువగా తీసుకోవడం వల్ల హైబీపీ రిస్కు ఉండదు. పండ్లు, కూరగాయలు, బీన్స్, ఫ్యాట్ లేని డైరీ ప్రొడక్ట్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు: ఫైబర్ కూడా డైట్లో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. హదయ సంబంధిత సమస్యలు రాకుండా ఇది సహాయ పడుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ని తగ్గిస్తుంది. బీన్స్, నట్స్, ఓట్స్ లాంటివి ఎక్కువగా వుండేటట్టు తీసుకోండి. తెలియక పోవడంవల్ల సమయం లేక పోవడం వల్ల తల్లులు, పిల్లలకు మంచి ఆహారం ఇస్తారు. కానీ వాళ్ళు తినడం మర్చిపోతారు లేదా స్కిప్ చేస్తూ ఉంటారు. దీని వల్ల తల్లుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి తల్లులు ఇంట్లో వాళ్లకి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో వాళ్లు కూడా వాళ్ల ఆరోగ్యం పట్ల అంతా శ్రద్ధ తీసుకోవాలి.
తల్లుల ఆరోగ్యం కోసం
- సరైన టైమ్‌కి ఆహారం తీసుకుంటూ ఉండాలి. డైట్లో తప్పకుండా పప్పులు, బీన్స్, గింజలు మొదలైన వాటిని తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా కూరలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎంత తింటున్నారో గమనించి మర్చిపోకుండా మొత్తం తినాలి.
- పండ్లు, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి కూడా డైట్లో తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. నట్స్, వేయించిన పల్లీలు లాంటివి స్నాక్స్ కింద తీసుకోవడం మంచిది. అదే విధంగా మంచి నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఎక్కువ నీళ్లు తాగాలి. వ్యాయామ పద్ధతుల్ని కూడా పాటిస్తూ ఉండాలి. రోజుకి కనీసం ఓ 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఈ విధంగా తల్లులు అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది ఎటువంటి సమస్యలు ఉండవు.
- ప్రతీ రోజు ఎంతో పని ఉంటుంది. దానితో పాటుగా తీవ్రమైన ఒత్తిడి లాంటివి ఉంటాయి. ఆ సమయంలో ఒత్తిడి మరింత ఎక్కువై పోయింది. చాలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు ప్రాముఖ్యం ఇచ్చి కాస్త సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించడం మంచిది.