Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కారణం లాక్డౌన్. మరి బరువు పెరగకుండా ఏం చెయ్యాలి? అధిక బరువు ఉండేవారికి చాలా సమస్యలు ఎదురవుతాయి. తినే తిండిని తగ్గించుకోలేరు. తగ్గించుకోవడం మంచిది కూడా కాదు. కానీ కేలరీలు కరగాల్సిందే. ఇంట్లోనే ఉండిపోతే... ఇక కేలరీలు ఎక్కడ ఖర్చవుతాయి? అదే బయటకు వెళ్లే ఛాన్సుంటే... జిమ్ముకో, పార్కుకో వెళ్లి ఎక్సర్సైజులు చెయ్యవచ్చు. అలాగే... డ్యూటీలకు వెళ్లేటప్పుడు శారీరక శ్రమ ఉంటుంది కాబట్టి... కేలరీలు ఖర్చవుతాయి. ఇప్పుడు ఇళ్లలోనే చాలా మంది ఉండిపోవాల్సి రావడంతో... భారత దేశ ప్రజలు బరువు పెరిగే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఇంట్లోనే ఉండి ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
క అధిక బరువుతో బాధపడే వారు ఇంట్లోనే ఉంటూ సింపుల్ ఎక్సర్సైజులు చెయ్యమంటున్నారు డాక్టర్లు. మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, పాత వస్తువులు ఉంటే వాటిని తీసి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, బట్టలు వాషింగ్ మెషిన్లో కాకుండా చేతులతో ఉతుక్కోవడం, వంట చెయ్యడం ఇలాంటి ఏవో ఒక పనులు చేస్తూనే ఉండాలని సూచిస్తున్నారు.
- టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ల ముందు కూర్చొని సినిమాల వంటివి చూడటం కంటే ఇంట్లో ఎప్పటి నుంచో పూర్తి చెయ్యాలనుకుంటున్న పనులను ఇప్పుడు చేసేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే... ఇల్లంతా ఓసారి క్లీన్ చేసుకోవడం లేదా సున్నం, పెయింట్ వంటివి వేసుకోవడం మేలంటున్నారు. తద్వారా చాలా కేలరీలు కరుగుతాయంటున్నారు.
- తినే ఆహారం విషయంలోనూ తక్కువ కేలరీలు ఉండేవే తినాలని సూచిస్తున్నారు. వీలైనతవరకూ స్నాక్స్ తగ్గించమంటున్నారు. ఆకుకూరలు, కూరగాయల ఆహారం ఎక్కువగా తినాలని చెబుతున్నారు. ఫ్రైల బదులు కూరల వంటివి మేలంటున్నారు. వంటల్లో నూనె వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీరు తాగాలనీ, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, స్వీట్లు, చాకొలెట్లు వీలైనంతవరూ తగ్గించేయాలని చెబుతున్నారు.
క ఉదయం 7 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చెయ్యాలనీ, రాత్రి 7 గంటలకే డిన్నర్ పూర్తి చెయ్యాలని చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకుంటున్న కొద్దీ బాడీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని మర్చిపోవద్దంటున్న డాక్టర్లు. ఏదో ఒకటి చేసి కేలరీలు బర్న్ అయ్యేలా చేసుకోవాలని చెబుతున్నారు. జస్ట్ లాన్లో నడిచినా గంటకు 280 కేలరీలు బర్న్ అవుతాయని అంటున్నారు.