Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఏ పండ్లు తిన్నా ఆరోగ్యమే. కానీ డయాబెటిక్ పేషెంట్లు చక్కెర స్థాయి తక్కువ ఉండే పండ్లను తీసుకోవడం ఆరోగ్యకరం. అందుకే ఏ పండ్లలో ఎంత శాతం చక్కెర ఉందో తెలుసుకుందాం.
జామ: పోషకాలు పుష్కలంగా ఉండే జామకాయ తింటే ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. పచ్చికాయలో ఫైబర్ వల్ల చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది.
మామిడిపండు: పచ్చిదైనా, పండైనా, చివరికి ఎండిన మామిడైనా సరే... ఔషధ గుణాలు అలాగే ఉంటాయి. మామిడితో తయారు చేసే చూర్ణంతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చక్కెర మాత్రం ఇందులో ఎక్కువగానే ఉంటుంది. ఒక చిన్న మామిడిపండులో 23 గ్రాముల చక్కెర ఉంటుంది.
దానిమ్మ: వంద రోగాలకు ఒక్క పండు అని దానిమ్మను పిలుస్తారు. అంటే చాలా రోగాలకు దానిమ్మ చక్కగా పనిచేస్తుందని అర్ధం. అందువల్లే ఇది పండుగా కన్నా మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతోంది. 100 మిల్లీలీటర్ల దానిమ్మ రసంలో 12.65 గ్రాముల చక్కెర ఉంటుంది.
యాపిల్: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు కదా. అది చాలా వరకూ నిజమే. యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 మిల్లీలీటర్ల యాపిల్ జ్యూస్‌లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.
ఆరెంజ్: చూడగానే ఆకట్టుకుంటూ, రుచికరంగా ఉండే కమలాపండుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 100 మిల్లీలీటర్ల ఆరెంజ్ జ్యూస్‌లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది.
ద్రాక్ష: రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏ సీజన్లోనైనా దొరికే ఈ ద్రాక్ష... మనకు అవసరమైన ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాల్ని అందిస్తుంది. చక్కెర మాత్రం ఎక్కువే. 100 మిల్లీలీటర్ల ద్రాక్ష జ్యూస్‌లో 14.2 గ్రాముల చక్కెర ఉంటుంది.
అరటి: రోజుకో అరటి పండు తింటే శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. అజీర్ణాన్ని తగ్గించడంలో, కడుపులోని అల్సర్లను పోగొట్టడంలో అరటి మేలు చేస్తుంది. అరటిలో ఉండే పొటాషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. కాకపోతే చక్కేర అధికం. ఒక అరటి పండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది.