Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐస్ క్యూబ్ ట్రేలో వాటర్ పోసి దానిని ఫ్రిజ్లో పెడితే అవి ఐస్ క్యూబ్స్గా మారిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉపయోగిస్తారు. మిక్సీలో ఏదైనా మిల్క్ షేక్ చేస్తూ కొన్ని ఐస్ క్యూబ్స్ అందరూ వేస్తారు. ఐస్ క్యూబ్ ట్రేని ఫిల్ చేసే విషయంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. దాంతో మంచినీళ్ళు వృధా అవుతాయి. మరి నీరు కిందపోకుండా నింపాలంటే ఏం చేయాలో చూద్దాం...
క ఐస్ క్యూబ్ ట్రే చక్కగా పొడవుగా ఉంటుంది. దీనిని ఫిల్ చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు కింద పడి పోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండాలంటే ఐస్ ట్రే ఫిల్ చేసేటప్పుడు సరిగ్గా ఫిల్ చేయాలి. చాలా మంది వాటిని తిన్నగా పట్టుకుని ఫిల్ చేస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు.
క ఐస్ క్యూబ్ ట్రేని నింపేటపుడు కొద్దిగా దానిని వంచి ఆ తర్వాత నీళ్లని దానిలో పోయాలి. ఇలా చేసేటప్పుడు ఒక్కో క్యూబ్ నుంచి ఒక్కో క్యూబ్కి వాటర్ మొత్తం నీళ్లు కింద పోకుండా నిండుతాయి. కాబట్టి ఈసారి మీరు ఎప్పుడైనా ఐస్ ట్రేని ఫిల్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ మర్చి పోకుండా పాటించండి. దాంతో నీళ్ళు వధా అవ్వవు. సులువుగా ఐస్ ట్రేని కూడా ఫిల్ చేసేయవచ్చు. క