Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిగ్గీ బ్యాంక్... పిల్లలలో సజనాత్మకతను, వ్యూహాత్మక ఆలోచనలను నేర్పిస్తుంది. అయితే పిగ్గి బ్యాంక్ ఎలా ఉండాలి, పిల్లలకు పిగ్గీ బ్యాంక్ ఎలా ఉంటే నచ్చుతుందనే విషయాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. అందమైన పిగ్గీ బ్యాంకులను చిన్నారుల చేతికి ఇస్తే వారు చక్కగా తమకు ఇచ్చిన డబ్బులను వాటిలో దాచుకుంటారు. కాబట్టి అలాంటి అందమైన పిగ్గీ బ్యాంక్‌ను ఎలా డెకరేట్ చేయాలో తెలుసుకుందాం.
డెకరేషన్‌కు కావాల్సినవి: గలక్(మట్టితో తయారు చేసింది), కాయిన్స్, కలర్స్, పెయింట్ బ్రష్, మౌల్డిట్ (గమ్)
తయారుచేసే విధానం: ముందుగా మట్టితో తయారు చేసిన ముంతను తీసుకుని మీకు నచ్చిన కలర్‌ను పెయింట్ బ్రష్ సహాయంతో గలక్ మొత్తానికి వేయండి. ఇప్పుడు మీ ఇంట్లో పనికి రాని చిల్లర కాయిన్స్ అంటే అర్ధరూపాయి, పావలా బిళ్లలు ఉంటే వాటికి మీకు నచ్చిన రంగును వేయండి. ఇప్పుడు ఈ బిళ్లలను మౌల్డిట్ సహాయంతో ముంతకు అంటించండి. అంతే అందమైన పిగ్గీ బ్యాంక్ తయారైనట్టే.