Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో వచ్చే వ్యాధులను దూరంగా ఉంచేందుకు మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు దోహదపడుతాయి.
- వర్షాకాలంలో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు. నేరేడును పండ్లలో రాజు అని కూడా అంటారు. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి.
- వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్ ముక్కలు తింటే మంచిది.
- అరటిలో విటమిన్లూ, మినరల్స్ అధికం. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి అందడమే కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.
- విటమిన్ 'సి' అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిది.