Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలా మంది ప్రతి రోజూ కూరగాయలు తెచ్చుకోకుండో.. వారానికి ఓసారి జరిగే మార్కెట్లోనే తీసుకుంటారు. వారానికి సరిపడా కూరగాయలు, పండ్లను అక్కడే కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే మంచిది. అయితే అన్ని రోజుల పాటు కూరగాయలు పాడవకుండా ఉండాలంటే ఫ్రిజ్ ఉండాల్సిందే. కానీ ఫ్రిజ్‌లో పెట్టకుండానే కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో మనమూ తెలుసుకుందాం...
- మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొత్తమీరను నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పటికే పాడయిపోయిన ఆకులను తొలగించాలి. తర్వాత కొత్తమీరను పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇంట్లో చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే కొత్తిమీర తాజాగా ఉంటుంది.
- పుదీనా కట్టలను విప్పిదీసి అన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. పాడైపోయిన ఆకులు, మట్టిని తొలగించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లుపోసి అందులో పుదీనాను ఉంచండి. ఆకులు పైకి తేలి.. వేర్లు నీటిలో మునిగేలా చూసుకోండి. అనంతరం ఓ కాటన్ వస్త్రాన్ని నీటితో తడిపి ఆ గిన్నెపై కప్పాలి. ఇలా చేస్తే పుదీనా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
- టమాటాలను ఇంట్లో చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచాలి. అన్నింటినీ ఒకే దగ్గరగా కాకుండా.. కొంత గ్యాప్ ఉండేలా దూరం దూరంగా స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే టమాటాలు త్వరగా పాడవవు.
- భూమి లోపల పెరిగే క్యారెట్, బీట్రూట్ వంటి దుంపలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వేర్లు, ఆకులను తీసివేసి శుభ్రంచేసుకోవాలి. వాటిని ఇంట్లో కూల్‌గా ఉండే ప్రాంతంలో నిల్వ చేసుకోవాలి.
- పుట్టగొడులు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని పేపర్ బ్యాగ్‌లో ఉంచి చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫ్రిజ్ లేకుండానే కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.