Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి జంటల్లో అర్థం చేసుకునే గుణం తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుని విడిపోతున్నారు. కొన్ని జంటలైతే పెండ్లయిన కొన్ని వారాల్లోనే ఇక కలిసి ఉండలేమని చెప్పేస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ లేకపోవడం, ఒకరిని ఒకరు అంగీకరించలేకపోవడం, ఫ్రస్ట్రేషన్, కోపం... ఇలా వివిధ కారణాల వల్ల చాలా త్వరగా విడిపోతున్నారు. అయితే ప్రతి రిలేషన్ షిప్లో కొన్ని బాధలు ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, ఈగో విడిపోవడానికి ముఖ్యకారణం. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి బయట పడాలంటే కొన్ని అనుసరించడం మంచిది. ఇవి మీ రిలేషన్ షిప్ బాగా ఉండడానికి సహాయ పడతాయి. అవేంటో చూద్దాం.
ఒకరినొకరు అంగీకరించుకుని
నా జీవితంలోకి వచ్చే వ్యక్తి ఇలా ఉండాలి.. నన్ను సంతోష పెట్టాలి.. ఎప్పుడూ నన్ను బాగా చూసుకోవాలి అనుకునే బదులు ఫ్లెక్సిబుల్‌గా ఇద్దరూ ఒకరినొకరు అంగీకరించుకుని ప్రేమించుకోవాలి. మంచిగా అర్థం చేసుకుంటూ ఉండాలి. మా ప్రేమ చాలా బాగుంది మేమిద్దరం కలకాలం ఇలానే ఉండాలి.. ఇద్దరి మధ్య గొడవలు ఏమీ రాకుండా మంచిగా ఉండాలి అని మంచి హెల్దీ రిలేషన్‌షిప్‌ని అనుసరిస్తూ ఉండాలి.
నిజమైన ప్రేమలో...
ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాతావరణంగా పెరిగివస్తారు. వాళ్ళు నేర్చుకునే పద్ధతులు కూడా వేరు వేరుగా ఉంటాయి. అటువంటి సమయంలో నేనూ, నా జీవిత భాగస్వామి నిజమైన ప్రేమలో ఉండాలి. ఒకరినొకరు ఒప్పుకుంటూ ఉండాలి. ఒకరినొకరు ఇష్టపడి మంచి అందమైన రిలేషన్షిప్లో ఉండాలి అని ప్రతి ఒక్క జంట కూడా అనుకుంటూ ఉండాలి.
వారి కోసం మారాలి
నా జీవిత భాగస్వామి కోసం నేను మారతాను. మేము ఇద్దరం మంచిగా జీవించగలం. ఒకరినొకరు ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఆనందమైన జీవితాన్ని సాగిస్తాము అని ఒకరి కోసం మరొకరు మారుతూ ఉండాలి.
ఇతరులను చూసి...
సినిమాలో చూసో లేదో ఎవరి మాటలో పట్టుకునో జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఇతరులను చూసి ప్రభావితం కావొద్దు. వాటిని వీటిని పక్కన పెట్టేసి మంచి అందమైన జీవితాన్ని మేమిద్దరం పొందాలి అని అనుకోవాలి.
మాటకు విలువివ్వండి
ఊహల్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వాటి నుండి బయటకు వచ్చేసి నిజమైన జీవితాన్ని గడపడం మంచిది. నిజమైన ప్రేమలో కెమిస్ట్రీ, ప్యాషన్ ఉంటాయి. ఏది ఏమైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి మాటకి ఒకరు విలువిచ్చి జీవితాన్ని సాగించాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.