Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను గందరగోళ పరిచింది. అలాగే విద్యా విధానంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అనివార్యంగా ఆన్లైన్ విద్యవైపుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ విద్యలో ఎన్నో మార్పులు తీసుకువస్తూ... విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నాము అంటున్నారు 'బైజు' సంస్థ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్. ఈ కరోనా కాలంలో ఓ మహిళగా... ఓ తల్లిగా... ఓ వర్కింగ్ ఉమెన్‌గా... ఓ సంస్థకు నాయకురాలిగా ఆమె ఎదుర్కొన్న... ఎదుర్కొంటున్న సవాళ్ళను... వాటి నుండి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆమె మనతో పంచుకుంటున్నారు.
నేను పుట్టింది బెంగళూరులో. నాన్న అపోలో హాస్పిటల్లో నెఫ్రోలాజిస్ట్, అమ్మ దూరదర్శన్‌లో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్. వీరికి నేను ఏకైక సంతానం. చిన్నతనంలో నాన్న నాకు సైన్స్ గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్లో నా పాఠశాల విద్యను పూర్తి చేసి, బెంగళూరులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బయోటెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేశాను. 2007లో గ్రాడ్యుయేషన్ తర్వాత జీఆర్ఈ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో అక్కడ క్లాసులు బోధిస్తున్న బైజు రవీంద్రన్తో పరిచయం అయింది. తరగతిలో నాలోని ప్రశ్నించే తత్వాన్ని గమనించిన బైజు నాలో టీచింగ్ నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయని ఆవైపుగా ప్రోత్సహించారు. తర్వాత అతన్నే వివాహం చేసుకున్నాను.
ఉపాధ్యాయురాలిగా కనిపించేందుకు
బైజు ప్రోత్సాహంతో 2008లో నాకు 21 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఉపాధ్యాయురాలిగా నా కెరీర్‌ను ప్రారంభమైంది. 100 మంది విద్యార్థులతో కూడిన ఆడిటోరియంలో నేను క్లాస్ చెప్పాలి. వారు నాకన్నా రెండేండ్లు చిన్నవారు. వారికి నేను ఓ ఉపాధ్యాయురాలిలా కనిపించేందుకు క్లాస్‌కు చీర కట్టుకుని వెళతాను. నేను మ్యాథ్స్, ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్ క్లాసులు బోధిస్తాను.
ఉచిత తరగతులు అందించాము
2011లో నా భర్తతో కలిసి 'బైజు' అనే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించాను. మొదట్లో మా సంస్థ పాఠశాల విద్యకు తోడ్పడటానికి వ్యక్తిగత విద్యను అందించాము. 2015లో వీడియో పాఠాలతో ఆన్లైన్ తరగతులను ప్రారంభించాము. అప్పటి నుండి నేను కూడా వీడియోలలో ఉపాధ్యాయురాలిగా కనిపించాను. భారతదేశంలో కోవిడ్ -19, లాక్డౌన్ సమయంలో ఇది ఉచిత తరగతులను అందించింది. మార్చి, ఏప్రిల్ 2020లో మొత్తం 50 మిలియన్లకు, 13.5 మిలియన్ల వినియోగదారులను చేర్చింది. సెప్టెంబర్ 2020 నాటికి 70 మిలియన్ల విద్యార్థులకు ఇది చేరుకుంది. అలాగే 4.5 మిలియన్ల మంది చందాదారులుగా చేరారు.
కొన్ని సమస్యలు ఉన్నాయి
కరోనా సమయంలో విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్లైన్ విద్యనే అందరికీ ఉన్న మార్గం. ఇది తప్ప వేరే అకాశం లేదు. ఈ ఆన్లైన్ విద్యను వేగంగా స్వీకరించినా దీనిలో కొని సమస్యలు ఉన్నాయి. వాటిని మేము దూరం చేసే ప్రయత్నం చేశాము. విద్యార్థులు నేర్చుకోవడంపై దష్టి సారించేలా మేం చేయగలుగుతున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థులకు నిరంతరాయంగా నేర్చుకునేలా చూస్తున్నాం.
అంతరాయం లేకుండా
డిజిటల్ ఫస్ట్ కంపెనీలో భాగం కావడంతో కొన్ని సాధారణ సమస్యలు ఎదుర్కోన్నాము. వాటిని మేము స్వీకరించాము. అయితే వ్యక్తిగతంగా నాకు చాలా తక్కువ సవాళ్ళు ఉన్నాయి. అయితే ఇటు ఇంటిని, అటు ఆన్లైన్ క్లాసులను చూసుకోవడం కాస్త కష్టంగానే ఉండేది. నా పెద్ద కొడుకు ఆన్లైన్ తరగతులు, అధికారిక సమావేశాలు, వీడియో రికార్డింగ్‌లతో బిజీగా ఉండాల్సి వచ్చేది. వీటన్నింటి మధ్య నా నెలల బిడ్డకు సంబంధించిన పనులు అదనం. ఈ పనులన్నింటికీ ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకునేందు ఓ వ్యక్తిగత ప్రణాళిక రూపొందించుకున్నాను.
మా ఇద్దరి మధ్య
నాలాగే ఏదో ఒక ఉపాధిలో ఉండే మహిళలకు.. ఇటు మహమ్మారిని ఎదుర్కోవడం.. అటు వ్యక్తిగత జీవితం మధ్య కొన్ని సమస్యలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో పనిచేయడంలో మా ఇద్దరి మధ్య సరిహద్దు లేకపోవడం, అలాగే నా వత్తి నా అభిరుచికి అనుగుణంగా ఉండటం నా అదష్టం. ఎందుకంటే మనం చేసే పనిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ పని ఎంత కష్టమైనదైనా ఇష్టంగా చేయగలం.
కోవిడ్ లేని సమాజం కోసం
గత సంవత్సరాన్ని ఓసారి తిరిగి చూస్తే.. ఈ రోజు మనం గడుపుతున్న జీవితాన్ని ఎవరూ ఊహించలేరని మనమందరికీ తెలుసు. మనమందరం ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. వ్యక్తిగతంగా కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. కరోనా 'యజమాని-ఉద్యోగి' సంబంధాన్ని పునర్నిర్వచించింది. పారదర్శకత, కమ్యూనికేషన్ ద్వారా నడిచే సానుభూతిగల నాయకత్వం, ఈసారి నా బందంతో కలిసి పని చెయ్యడానికి నాకు సహాయపడింది. అదనంగా మా ఉద్యోగులకు సహాయం చేయడానికి, వారి కుటుంబాలకు కోవిడ్-19కు సంబంధిత వైద్య ఖర్చులను భరించటానికి వారికి సహాయపడటానికి మేము రూ.20 కోట్ల నిధిని ఏర్పాటు చేసుకున్నాం. అన్నింటికంటే మించి కోవిడ్ లేని సమాజంలోకి సురక్షితంగా ప్రవేశించాలని మనమందరం ఆశిస్తున్నాం. ఈ సంక్షోభం నుండి బయటపడి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటామని నేను అనుకుంటున్నాను. డిజిటల్ ప్రపంచం ద్వారా ఆ ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి.
విద్య పరంగా...
ఉత్తమమైన ఆన్లైన్, ఆఫ్‌లైన్ అభ్యాసాలను మిళితం చేసే ఓ అభ్యాస రూపం ఉద్భవిస్తుంది. భవిష్యత్తుకు అనుగుణంగా మేము సమకాలిక అభ్యాస ఆకతుల సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాం. విద్యార్థులను శక్తివంతం చేసే దిశగా కషి చేస్తాము.
సరిహద్దులు పెట్టుకోవాలి
పనితో పాటు మహిళలు మన కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. సమతుల్య దినచర్యను కలిగి ఉండటం చాలా కీలకమని నేను నమ్ముతున్నాను. నా చుట్టూ కత్రిమ సరిహద్దులను నిర్ణయించడం ద్వారా నేను దీన్ని చేస్తాను. ఇలా సమన్వయం చేసుకోవడం నేను నా తల్లిని చచిన్న వయసులోనే నేర్చుకున్నాను. ఈ కత్రిమ సరిహద్దులు నా పనులకు ప్రాధాన్యం ఇవ్వడానికి సహాయపడతాయి. ఒకే సమయంలో పది పనులు చేయడానికి బదులుగా చేతిలో ఉన్న ఒకే పనికి 100 శాతం ప్రాధాన్యం ఇస్తాను. మల్టీ టాస్కింగ్ ఓ నైపుణ్యం. అయితే.. ఇది ఒక వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడిని కూడా కలిగిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. అదనంగా ఫిట్‌నెస్‌కు ఉన్న ప్రాముఖ్యతను కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మంచి మనసు, శరీరం.. ఈ రెండింటి కలయిక మనల్ని బలంగా చేస్తుంది.
- సలీమ