Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీస్పూన్ తేనె, కొద్దిగా వెచ్చని నీరు తీసుకోండి. మొదట వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఆపై ఫేస్ వాష్ మాదిరిగానే మీ ముఖాన్ని తేనెతో 2 నుండి 3 నిమిషాలు మసాజ్ చేసి కడగాలి.
క నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయండి. 15 నిమిషాలు అప్లై చేసి ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా చేస్తే ముఖం మీద మెరుపు కనిపిస్తుంది. ఇలా నిత్యం చేస్తే మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుకోవచ్చు.
- గంధపు చెక్క, చనా పిండి, పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖం మీద రుద్దడం వల్ల చర్మం మెరుస్తూ చర్మం మదువుగా ఉంటుంది.
- ముఖం మెరుస్తూ ఉండటానికి బొప్పాయిని కూడా ఉపయోగించవచ్చు. పై తొక్క తురుమి రసం పిండాలి. దాని గుజ్జును రోజ్ వాటర్‌తో కలపండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
- టమోటాలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే బ్లీచ్ క్రీమ్ గుణాలు కూడా ఉంటాయి. టమోటాలను మొదటగా పేస్ట్ చేయండి. తర్వాత 10-15 నిమిషాలు ముఖం మీద మెల్లగా రుద్ది నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే ముఖంపైన మచ్చలు తొలగిపోతాయి.
- ముఖం మీద ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేస్తే ముఖంపై తక్షణం గ్లో వస్తుంది.