Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తరువాత ప్రజల జీవనశైలి చాలా వరకు మారింది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చనే విషయం చాలామందికి అర్థమైంది. దీంతోపాటు వ్యాయామం, బాడీ ఫిట్‌నెస్‌పై ప్రజల ఆలోచన మారింది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో నడక ప్రాధాన్యం గుర్తిస్తున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అయితే నడిచే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
నడక ప్రయోజనాలు: నడక మన శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దినచర్యపై ఎలాంటి ప్రభావం పడకుండా నడకను ఆస్వాదించవచ్చు. గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్త పోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక దూరం చేస్తుంది. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుందని, సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చని వెల్లడించారు.
ఎంత సమయం నడవాలి?: వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగని ఈ 150 నిమిషాల పాటు అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. సాధారణ నడకతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని, తీవ్రతను పెంచుకోవచ్చు. ఒక వ్యక్తి వారానికి ఐదు రోజుల పాటు.. ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున ఇలాంటి వ్యాయామం చేయాలని మయో క్లినిక్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందొచ్చు.
ఎన్ని అడుగులు నడవాలి?: ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తూ.. రోజుకు రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. సగటున 2,000 అడుగుల నడకను ఒక మైలుగా లెక్కించవచ్చు. ఈ దూరాన్ని ట్రాక్ చేసే పెడోమీటర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని బెల్ట్‌కు పెట్టుకొని నడిస్తే, దూరం తెలుస్తుంది. కొన్ని రకాల స్మార్ వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లను సైతం ఇందుకు ఉపయోగించవచ్చు. వారానికి కేవలం ఐదున్నర మైళ్ల దూరం నడిచేవారు.. అదికూడా గంటకు రెండు మైళ్ల వేగంతో నడిచేవారు కూడా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాల్లో తేలింది. అయితే కొంతమంది మాత్రం రోజుకు 10,000 అగుడులను లక్ష్యంగా పెట్టుకుంటారు. సాధారణంగా ఎక్కువ వేగంతో, ఎక్కువ దూరం నడిచేవారికి మంచి వ్యాయామ ఫలితాలు అందుతాయి.
ఎంత వేగంగా నడవాలి?: నిమిషానికి 80 అడుగుల నడకను సాధారణ వేగంగా.. నిమిషానికి 100 అడుగులను మధ్యస్థం నుంచి చురుకైన వేగంగా పరిగణించాలి. నిమిషానికి 120 అడుగులను ఎక్కువ వేగంగా గుర్తించవచ్చు. అయితే అసలు ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా చురుగ్గా నడవడంపై దృష్టి పెట్టడం మంచిది. నడక వంటి మధ్యస్థ తీవ్రత గల వ్యాయామం.. పగటిపూట ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. స్నేహితులతో కలిసి వాకింగ్‌కు వెళ్లడం, లేదా పెంపుడు కుక్కలను పక్కన తీసుకెళ్లడం వల్ల ఎక్కువ దూరం నడవగలుగుతారు. ఈ సమయంలో మ్యూజిక్ వింటూ, నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా ప్రేరణ పొందవచ్చు. రి