Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహమ్మారి కారణంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో మనం చాలా తెలుసుకున్నాం. గతంలో చెట్ల ప్రాముఖ్యత తెలియక వాటిని మనమే నరికేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆక్సిజన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడటంతో ప్రకృతి పట్ల ఉండే విలువ తెలుసొచ్చింది. ఈ ప్రకృతికి మనం అందించే ఓ అందమైన భావోద్వేగాల గేయమే మన జీవనశైలి. ప్రకృతితో మనకు ఉన్న బంధాన్ని చాటుకునేందుకు ఈ సమయం మనకు ఎంతగానో ఉపయోగపడింది.
బయోఫిలిక్ భావనల ప్రేరణతో పర్యావరణానికి మనలో ప్రకృతిపై దాగి ఉన్న అనుబంధం పునరుత్తేజితం అవుతుందని వాళ్లు పేర్కొన్నారు. జీవరూప ఆకృతులు, ఆర్గానిక్ నిర్మాణాలు, సహజసిద్ధమైన రంగులు కలిగిన ఫలకాలు వంటి వాటిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని అన్నారు. ఇవి సౌకర్యంతో పాటు ప్రశాంతతను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ప్రాకృతిక అంశాలు ఇప్పుడు వినూత్న ఫ్యాషన్ రీతుల్లో రూపొందుతూ కొత్త నిర్వచనాన్ని సంతరించుకోవడంతో పాటు ఉద్దీపనాలుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
బయోఫిలిక్ అంటే ఏంటి?: బయోఫిలిక్ అనేది 1984లో ప్రకృతి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ విల్సన్ చేత సృష్టించబడిన పదం. దీని అర్థం సహజమైన ప్రకృతి ప్రేమ అని. ఇది మనం సహజంగా పెంపుడు జంతువులు, మొక్కల నుంచి ప్రయోజనం పొందే విధానాన్ని సూచిస్తుంది. నివాస ప్రాంతాలలోనే కాకుండా పని ప్రదేశాలలో కూడా మొక్కల ద్వారా బయోఫిలిక్ వంటి సహజ ప్రయోజనాలను పొందవచ్చు.
బయోఫిలిక్ ప్రభావం: సహజంగా మనుషులు బయోఫిలిక్ నుంచి మానసి కంగా, శారీరకంగా చాలా ప్రయోజ నాలు పొందుతారు. ఎందుకంటే మన
ఇంట్లో పెరిగే మొక్కల కోసం మనం ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కొద్దిగా నీళ్లు పోస్తే చాలు. అవి మనకు శ్వాసను, ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇంట్లో పెరిగే మొక్కల ఉనికి ఆందోళనను, రక్తపోటును తగ్గిస్తుందని, ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. వాస్తవానికి మొక్కలు గదిలోని గాలిని శుద్ధి చేయడానికి, అదనపు ఆక్సిజన్‌ను అందించడానికి సహాయపడతాయి.
ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో వాకింగ్‌కు వెళ్లడం సర్వసాధారణం. కానీ బయోఫిలిక్ ప్రభావం మనం ఆరుబయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఓ పార్కు లేదా తోటలో ఉడతలు, పక్షులు, జింకలు, ఇతర హానిచేయని జంతువులను చూసే ప్రకృతి దృశ్యం ద్వారా శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాకుండా ఏడీహెచ్‌డీ వంటి రుగ్మతల ప్రభావాలను బయోఫిలిక్ డిజైన్లు తగ్గిస్తాయి.
ఇంటికి సంబంధించిన బయోఫిలిక్ డిజైన్లలో కిటికీలు ముఖ్యమైనవి. ఎందుకంటే కిటికీల ద్వారా ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి ప్రవేశిస్తుంది. దీంతో మీకు తెలియకుండానే ప్రకృతితో అనుసంధానం చేయబడతారు. ప్రకృతిలోని శబ్దాలు, గాలి వీయడం, సూర్యకాంతి ఇంట్లోకి పడటం వంటివి కిటికీల ద్వారా సాధ్యపడతాయి. అందువల్ల ఇంటికి కిటికీలను సరైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఇంటిలో బయోఫిలిక్ డిజైన్ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించడానికి సహజ ఆకృతులు, రంగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. గోడలు, కిటికీలపై పెయింటింగ్ బదులు డ్రాయింగ్ వేసేందుకు మొగ్గు చూపితే ఇల్లు మరింత ఆహ్లా దంగా ఉంటుంది.