Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లం రసాన్ని పాలలో లేదా టీలో కలుపుకొని తాగితే పొట్టలో అనారోగ్యాలన్నీ నయం అవుతాయి. మలబద్ధకాన్ని నివారించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అలసట, రొమ్ము నొప్పిని పోగొడుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అది నిజమైన అల్లం అయితీరాలి. మరి నకిలీ అల్లం అని ఎలా తెలుసుకోవాలి?
- అల్లం కొనేటప్పుడు గోరుతో గిచ్చి చూడాలి. అలా గిచ్చగానే అల్లంలోని సువాసన మీ ముక్కుకు వచ్చి తగులుతుంది. అలా వస్తే అది నిజమైన అల్లమే. మీరు ఆ అల్లం షాపు నుంచి వెళ్లిపోయినా మీ వేలి గోరుకు ఉన్న అల్లం సువాసన మీకు వస్తూనే ఉంటుంది. అంటే అది సరైన అల్లం అని అర్థం. అలా వాసన రాకపోతే... ఆ అల్లం కొనవద్దు.
- మంచి అల్లం తొక్క చాలా పలుచగా ఉంటుంది. గోరుతో ఇలా స్క్రాచ్ చేసినా చాలు తొక్క ఊడుతుంది. అలా తొక్క ఊడి వస్తే అది నిజమైన అల్లం. తొక్క రాకుండా గట్టిగా ఉంటే అది నకిలీ అల్లం అని గుర్తించాలి.
- మీరు కొనే అల్లానికి మట్టి ఉండి తీరాలి. ఎందుకంటే అల్లం మట్టి లేదా ఇసుకలోనే పెరుగుతుంది. మీరు కొనే అల్లానికి ఏ మట్టీ లేకుండా చాలా అందంగా ఉందంటే దాన్ని కెమికల్స్‌లో ముంచి తీసి ఉండొచ్చు. మట్టిని తొలగించడానికి అలా చేస్తుంటారు. అలాంటి అల్లం కొనవద్దు. మట్టితో ఉన్న అల్లమే కొనుక్కోండి. ఇంటికి తెచ్చాక... దాన్ని కడిగి శుభ్రం చేసుకోవచ్చు.
- అల్లంని కడిగిన తర్వాత డైరెక్టుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. దాని తొక్కను తొలగించి మిక్సీలో గ్రైండ్ చేసి ఓ సీసాలో వేసి మూత గట్టిగా పెట్టి ఆ సీసాను ఫ్రిజ్‌లో ఉంచుకోండి. కావాల్సినప్పుడు వాడుకోండి. ఇలా చేస్తే... అల్లం పాడవకుండా ఉంటుంది. దాని సువాసన కూడా అలాగే ఉంటుంది.