Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తర్వాత పోషకాహారంపై మనందరికీ అవగాహన చాలావరకు పెరిగింది. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసివచ్చింది. దీంతో ఆహారం విషయంలో అభిప్రాయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే కేవలం కరోనాను దష్టిలో పెట్టుకోవడమే కాకుండ, ఆరోగ్యకరమైన జీవన శైలిలో పోషకారం పాత్రను గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అనారోగ్యానికి కారణమయ్యే పదార్థాలను పక్కన పెట్టడం కూడా ముఖ్యమే. అందువల్ల రోగనిరోధక శక్తిని బలహీనపరిచే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
వేయించిన ఆహార పదార్థాలు
వేపుళ్లను ఎక్కువగా తినడం ప్రమాదకరమని పెద్దవాళ్లు చెబుతుంటారు. పదార్థాలను అతిగా వేయించినప్పుడు వాటిలో ఉండే చక్కెరలు.. ప్రోటీన్లు, కొవ్వులతో రసాయన చర్య జరుపుతాయి. ఇవి అనారోగ్యాలకు కారణమవుతాయి. నూనెలో బాగా వేయించిన పదార్థాలు శరీర కణజాలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, శరీర భాగాల పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్, బాగావేయించిన చేపలు, ఇతర మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి.
ఉప్పు
ఉప్పు రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరును దెబ్బతీస్తుంది. ఉప్పు శాతం పెరిగితే, శరీర భాగాల్లో వాపు ఏర్పడే అవకాశం ఉంది. ఇది రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాపించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బేకరీ ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారం, ప్యాకేజ్డ్ చిప్స్ వంటి పదార్థాల్లో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయడం మంచిది.
కత్రిక చక్కెరలు
కత్రిమ చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలతో వివిధ రకాల అనారోగ్యాల ముప్పు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీంతోపాటు శరీర భాగాల్లో వాపును కలిగించే కొన్ని రకాల ప్రోటీన్ల ఉత్పత్తిని ఇవి పెంచుతాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రక్తంలో ఎక్కువగా ఉండే చక్కెర వల్ల జీర్ణక్రియలను సమతుల్యం చేసే గట్ బ్యాక్టీరియా పనితీరు మందగిస్తుంది. అందువల్ల మార్కెట్లో లభించే స్వీట్లు, ఇతర తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
కెఫిన్
ఇది కాఫీ, టీలలో ఎక్కువగా ఉంటుంది. కెఫిన్లో ఉండే యాంటీఆక్సిడెంట్లతో శరీర జీవ క్రియలకు మేలు జరుగుతుంది. కానీ ఇది శరీరంలో అధిక మొత్తంలో చేరితే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. నిద్ర సమస్యలు, కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలను కెఫిన్ పెంచుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.