Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన వంటగదిలో ఉండేవన్నీ మన ఆరోగ్యాన్ని, ఆయుష్షునూ పెంచేవే. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చాలా వున్నా... కొన్నింటి వల్ల అదనపు ప్రయోజనాలుంటాయి. అవే ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు, అల్లం. సాధారణంగా ఇవి అన్ని వంటల్లోనూ వాడతాం. వైరస్లు ప్రబలే కాలంలో ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించాలి. ఇవి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్కి ఎనర్జీని ఇస్తాయి. ఎలాగంటే...
ఉల్లిగడ్డ: ఉల్లి ధర పెరిగినప్పుడు ఆందోళనలు చెయ్యడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే... అందరూ ఉల్లిని వాడాలి. ఉల్లిలో విటమిన్ సి, సల్ఫర్, జింగ్, సెలెనియం, క్వెర్సెటిన్ ఉంటాయి. ఇవి మన వ్యాధినిరోధక శక్తిని అలా పెంచేస్తాయి. ముఖ్యంగా క్వెర్సెటిన్ అనేది నిండా యాంటీవైరల్ గుణాలతో ఉంటుంది. సెలెనియం కూడా అంతే. వైరస్ల వల్ల అలెర్జీలు రాకుండా చేస్తుంది. కాబట్టి తినే ప్రతీ వంటలో ఉల్లి ఉండేలా చేసుకోండి.
వెల్లుల్లి: కాల్షియం, పొటాషియం, సల్ఫ్యూరిక్ కాంపౌండ్లతో... వ్యాధి నిరోధక శక్తిని భారీగా పెంచడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. బాడీలో క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలను వెల్లుల్ని పెంచుతుంది. వెల్లుల్లిని పచ్చిది తింటే మంచిది. ఎందుకంటే వేడి చేస్తే... అందులోని సల్ఫర్ ఎంజైములు పోతాయి. మన పెద్దోళ్లు... పచ్చళ్లలో వెల్లుల్లి రెబ్బలు వేసేది ఇందుకే. పచ్చి వెల్లుల్లి తినలేమని అనుకుంటే ఓ నాలుగు రెబ్బల్ని పచ్చడి చేసి... ఏ నీటిలోనో కలుపుకొని గటగటా తాగేయండి. ఆ తర్వాత నోట్లో ఏ చక్కెరో కొద్దిగా వేసుకుంటే... నోరు చేదుగా ఉండకుండా ఉంటుంది. జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది.
అల్లం: అల్లం నిండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. మనకు వేడి చేస్తే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని అర్థం. ఆ వేడి లేకుండా రాకుండా అల్లం చేయగలదు. ముఖ్యంగా ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడేవారు... శ్వాస సమస్యలతో బాధపడేవారు... పచ్చి అల్లం రసం తాగితే మంచిది. పోనీ ఏ టీలోనో అల్లం వేసుకొని తాగినా మంచిదే. గుర్తుంచుకోండి... అల్లం ఎంత తాజాగా ఉంటే... అంత ఎక్కువ మేలు చేస్తుంది.