Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లని ముఖ సౌందర్యాన్ని నల్లని బ్లాక్ హెడ్స్ చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే ఈ చిట్కాలు పాటించేయండి. బ్లాక్ హెడ్స్‌ని డ్రైగా చేసే యాంటీసెప్టిక్ గుణాలు టొమాటోల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు టొమాటో రసాన్ని ముఖమంతా రాసుకుని, ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి. ఒకట్రెండు వారాల పాటు ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి.
ఓట్స్ పొడిలో పెరుగు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ వేసుకుని... బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. గ్రీన్ టీ ఆకుల్ని పొడి చేసి, కొంచెం నీళ్లు చేర్చి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాసుకుంటే బ్లాక్ హెడ్స్ పోతాయి. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ముఖాన్ని మసాజ్ చేసుకున్నా సమస్య తీరిపోతుంది.
దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేసినా చాలు.. బ్లాక్ హెడ్స్ బెడద తీరిపోతుంది.
గోరువెచ్చని పాలలో తేనె కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట పూయాలి. కాసేపటి తర్వాత పొడి బట్టతో ఆయా ప్రదేశాల్లో గట్టిగా ఒత్తుతూ తుడిస్తే చాలు. ప