Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాతో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కుర్చీలో గంటల తరబడి కూర్చోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది మంచిది కాదు. ఈ సమస్యకు మెంతులతో చెక్ పెట్టవచ్చు.
గుప్పెడు మెంతులను రాత్రంతా ఓ గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టాలి. ఉదయం బ్రష్ చేసిన తర్వాత.. పరగడుపున ఆ నీళ్లను తాగాలి. మెత్తగా అయిపోయిన మెంతులను కూడా తినాలి. ఇలా చేస్తే పలు రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మెంతులు యాంటీ ఆసిడ్‌గా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యలు ఉన్న వారు ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీటిని తాగాలి.నీటితో నానబెట్టిన మెంతులతో పాటు ఆ నీటిని తాగితే డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. శరీరంలోని కొవ్వును కూడా మెంతులు కరిగిస్తాయి. ప్రతి రోజు ఉదయం మెంతుల నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది.