Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూరల్లో ఉప్పు ఎక్కువయితే.. ఏం చేయాలోనని కంగారు పడాల్సిన అవసరం లేదు. వండిన వంటకాలను పడేయాల్సిన పనిలేదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. ఉప్పు తగ్గడమే కాదు.. టేస్ట్ కూడా మారదు. ఏ వంటకమైనా చాలా రుచికరంగా ఉంటుంది. వంటకాల్లో ఉప్పు ఎక్కువైతే.. వెంటనే చాయాల్సిన పని. అందులో కొన్ని నీళ్ళు పోసి మళ్లీ వేడి చేయడం. అయితే కొన్ని సార్లు ఇది కూడా వర్కవుట్ కాదు. నీరు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని మళ్లీ ఉడికించేందుకు సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ కింద పేర్కొన్న టిప్స్ ఫాటిస్తే సరిపోతుంది.
ఏదైనా కూరా లేదా సాంబర్లో ఉప్పు ఎక్కువగా అయితే.. వెంటనే కొన్ని ఆలు ముక్కలను కోసి అందులో వేయండి. ఆలు గడ్డలకు ఉప్పును పీల్చుకునే గుణం ఉంటుంది. కాసేపు అలాగే ఉంచి.. ఆ తర్వాత ఆలు ముక్కను తీసేయండి. ఇలా చేస్తే ఉప్పు తగ్గుతుంది. టేస్ట్‌లో తేడా ఉండదు.
ఉల్లిగడ్డలు కూడా ఉప్పును పీల్చేస్తాయి. ఏదైనా వంటకంలో ఉప్పు ఎక్కువగా ఉంటే.. అందులో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలను వేయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత ఉల్లి ముక్కలను తీసేయండి.
ఒక స్పూన్ నిండా వెనిగర్, చెక్కరను తీసుకోండి. ఆ మిశ్రమాన్ని కూరలో వేసి బాగా కలపడింది. కాసేపటి తర్వాత టేస్ట్ చూస్తే.. అందులో ఉప్పు తగ్గుతుంది. మీ టేస్ట్‌కు తగ్గట్టు ఉంటుంది.
ఒక చిన్న కప్పులో కొద్దిగా బియ్యం పిండి లేదా గోధుమ పిండి తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూను నీళ్లను పోసి బాగా కలపాలి. ఆ పిండి ద్రావణాన్ని ఉప్పు ఎక్కువైన కూరలో వేయాలి. ఇలా చేసినా.. కూరలో ఉప్పదనం తగ్గుతుంది.
టమాటాలను చిన్న చిన్నముక్కలుగా కోసి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను కూరలో వేసి కాసేపు ఉడికించాలి. కాస్త తియ్యగా.. కాస్త పుల్లగా ఉండే టమోటాలు.. కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గిస్తాయి.