Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పిల్లలు. దీంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరడంతో బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఉపాధి కల్పోయి, వేతనాలు రాక అవస్థలు పడుతున్న అనేక మంది పెరిగిన కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ కింది చిట్కాలు పాటిస్తే కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అన్ని గదులల్లో లైట్, ఫ్యాన్ వేసి ఉంచవద్దు. రూంలో నుంచి బయటకు వచ్చే సమయంలో లైట్, ఫ్యాన్‌ను ఆపేయాలి. అన్నం తినడం, టిఫిన్ చేయడం లాంటి సమయాల్లో ఇంట్లోని అందరూ ఒకే దగ్గర కూర్చోవడం ద్వారా మిగతా చోట్ల లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసి కరెంట్ ఆదా చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా మెరుగు పడతాయి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో ఒకటికి రెండు సార్లు లైట్లు, ఫ్లాన్లు, ఏసీలు, హీటర్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలన్నీ ఆఫ్ చేసి ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి.
ప్రతీ సారి లైట్లు, ఫ్లాన్లపై ఆధారపడొద్దు. ఇంట్లోకి పగటి పూట సహజమైన కాంతి వచ్చే ఛాన్స్ ఉంటే కిటికీలు, తలుపులు తీసి లైట్లను ఆఫ్ చేయడం మంచిది. గాలి కూడా బయట నుంచి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆఫ్ చేయొచ్చు.
నెలకు ఓసారి ఫ్రిజ్‌ను ఖాళీ చేసి శుభ్రపరచండి. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది.
సాయంత్రం, ఉదయం పూట ఏసీని బంద్ చేసి సహజంగా బయట నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం పూట కూడా ఏసీని ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంచడం బదులు రూం చల్లబడిన అనంతరం చాలా సేపు బంద్ చేసుకోవచ్చు.
చాలా మంది కంప్యూటర్ను వాడిన తర్వాత ఆఫ్ చేయకుండా అలానే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. కనీసం ఎప్పటికప్పుడు మానిటర్‌ను అయినా ఆపివేయండి.
ఇంట్లో ఎల్ఈడీ లైట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే విద్యుత్ ఆదా అవడంతో పాటు బిల్లు తక్కువగా వస్తుంది.
చాలా మంది ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు తదితర వస్తువులకు ఛార్జింగ్ పూర్తయిన అనంతరం ఛార్జర్లను అలానే వదిలేసి స్విఛ్ ఆఫ్ చేయకుండా ఉంటారు. అలా చేయడం వల్ల విద్యుత్ వృథా అవుతుంది. ఛార్జింగ్ పూర్తయిన వెంటనే ఛార్జర్ ఉంచిన ప్లగ్‌కు సంబంధించిన స్విఛ్ను ఆఫ్ చేయాలి.