Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టిలో మొదటి స్థానం తల్లీదే! రెండో స్థానం తండ్రిది. పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మ ఒడి లాలిస్తే అయితే.. నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. నాన్నలు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని నియంతల్లా వుంటారు. ఎందుకంటే తనను మించిన ప్రతిభావంతులు తమ పిల్లలు అవ్వాలని కోరుకుంటారు. పిల్లలు ఎలా బతకాలో నేర్పాలి.. బాధ్యత నేర్పాలి.. కష్ట నష్టాలు ఎలా భరించాలో నేర్పాలి.. జీవితంలో ఎలా ఎదురీదాలో చెప్పాలి వీటి అన్నింటికంటే ముఖ్యం జీవనాధారం. కుటుంబ బాధ్యత. అందుకే నాన్న ఇంటికి మూల స్థంభం. ఈ లోకానికి అతీతుడు. ఒక జ్ఞాని, ఒక స్థిత ప్రజ్ఞుడు, బోళా మనిషి. అందరి యోగ క్షేమాలు కోరుతూ గుండెలో బడబాలనం నింపుకునే మహామనిషి నాన్నా. తండ్రి లేకపోయినా తామే తల్లీ.. తండ్రీ అయ్యి ఒంటరి తల్లులు ఎంతో మంది తమ పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా అలాంటి తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ...
- పాలపర్తి సంధ్యారాణి