Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వచ్చాక చాలామందికి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. తెల్లారి లేస్తే... కరోనా టెన్షన్‌కి తోడు ఉద్యోగ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు... అన్నీ అవే. లాక్ డౌన్ వల్ల మనస్శాంతిగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. స్వచ్ఛమైన గాలి అందట్లేదు. అందుకే మనుషుల్లో కోపం, చిరాకు వంటివి పెరిగిపోతున్నాయి. వాటిని తగ్గించుకోకపోతే... నేరాలకు దారితీస్తాయి. సహజమైన ఎక్సర్సైజ్లు... ఒత్తిడిని పెంచే హార్మోనుల విడుదలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎండోర్ఫిన్ అనేది ఉత్పత్తి అయ్యి... మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని చేరవేస్తుంది. అలాగే బ్రెయిన్లో గమ్మా-అమైనోబ్యూటిరిక్ యాసిడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడ్ మార్చేస్తుంది. ఆవేశం, ఆతృత వంటివి ఎప్పటికీ ప్రమాదమే. మనపై మనకు కంట్రోల్ ఉండాలి. ఆసనాలు మనలో కోపం, ఉద్రేకం తగ్గిస్తాయి. నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. పాజిటివ్ ఆలోచనలను పెంచుతాయి. దాంతో ఒత్తిడి సమయాల్లో టెన్షన్ పెంచుకోకుండా నిలకడగా ఉండగలుగుతాము. మరి అందుకు వీలయ్యే యోగాసనాలు ఏవో తెలుసుకుందాం.
ఊపిరి ఎలా పీల్చాలో, బాడీకి ఆక్సిజన్‌ను ఎలా ఎక్కువగా పంపాలో... ప్రాణాయామం ద్వారా తెలుస్తుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఆక్సిజన్ పెరుగుతుంది. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. ఒత్తిడి, టెన్షన్, ఆతృత వంటివి తగ్గుతాయి. మానసికంగా ఫిట్ అవుతారు.
బ్రిడ్జి పోజ్.. దీన్నే సేతు బంధాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం మన శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇది మనలోని ఆతృత, టెన్షన్, మదనపడేతత్వాన్ని తగ్గిస్తుంది. కాళ్లు, వెనక భాగం మరింత చక్కగా సాగుతాయి. దాంతో నిద్ర బాగా పడుతుంది.
ఒంటె ఆసనం వేసినప్పుడు మనలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఒక్కసారిగా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. శరీరానికీ, మెదడుకీ ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది. దాంతో మనసు, శరీరం ప్రశాంతంగా అయిపోతాయి.
బాలాసనం అనేది మన నాడీ (నరాల వ్యవస్థ) వ్యవస్థను ప్రశాంతంగా చేస్తుంది. అలాగే శోషరసం క్రమబద్ధీకరించినట్టు అవుతుంది. ఈ బాలాసనం వల్ల మీ శరీరంలో ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.