Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త మొక్కలు పెంచడానికీ... పాతవాటికి సరైన పోషణని ఇవ్వడానికీ వర్షాకాలం మంచి టైం. కరోనా వల్ల అలంకరణ కోసం పెంచే మొక్కల కంటే ఆరోగ్యం కోసం పెంచే మొక్కలపైనే ఎక్కువ మంది దృష్టిపెట్టారు. కాబట్టి... ఇప్పుడు ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచే ప్లాంట్స్ గురించి తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా వుంది. అలాంటి కొన్ని మొక్కల గురించి ఈరోజు తెలుసుకుందాం...
తులసి..
తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ఇందులో మూడు రకాలున్నాయి. రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి. రోజూ కొన్ని తులసి ఆకులు తింటే కలిగే ప్రయోజనాలు...
గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆర్టరీల్స్లో క్లాట్స్ ఫార్మ్ అవ్వకుండా ప్రివెంట్ చేసి హైబీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్న వారికి ఎంతో మంచి చేస్తుంది.
గొంతులో గరగర నుండీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వరకూ తులసి బాగు చేయగలదు. దీనికోసం కాసిని ఆకులు నీటిలో వేసి మరిగించి ఆ నీరు తాగండి.
కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. తులసి కార్టిసాల్ లెవెల్స్‌ని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది.
తులసిలో ఉండే రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ ట్యూమర్ సెల్స్‌తో పోరాడుతాయి. లాంగ్-టెర్మ్‌లో కాన్సర్‌తో పోరాడడమే కాక రొమ్ము కాన్సర్ రాకుండా నివారిస్తాయి.
కాలేయం సరిగా పనిచేసేలా చేసి జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. కాన్స్టిపేషన్, బ్లోటింగ్‌ని తగ్గిస్తాయి.
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని తగ్గిస్తాయి. అరుగుదలకి సహకరిస్తాయి.
జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ని అరికడతాయి.
ఇమ్యూనిటీ పెంచుతుంది. సర్జరీల తరువాత వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది.
జాయింట్ పెయిన్స్, మోకాళ్ళు పట్టేయడం, వర్కౌట్స్ తర్వాత రికవరీ టైం ఎక్కువగా ఉండడం... ఇవన్ని ఇన్ఫ్లమేషన్కి చిహ్నాలు. తులసి ఆకులు ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి.
నాచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా పని చేస్తుంది.
మంచి కంటి చూపునిస్తుంది. తలనొప్పి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది.
ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది.
పుదీనా
పుదీనా చూసినా, వాసన పీల్చినా, తిన్నా ఎంతో హాయిగా ఉంటుంది. అసలు పుదీనా మొక్క చూస్తేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు...
అరుగుదలకి ఉపయోగపడుతుంది. కడుపులో ఇబ్బందులు లేకుండా చేస్తుంది.
ఆస్థ్మా రోగులకు కొంత రిలీఫ్ ఇస్తుంది.
జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ముక్కు, గొంతు, లంగ్స్‌లో ఉండే కంజెషన్ని క్లియర్ చేస్తుంది.
తలనొప్పి తగ్గిస్తుంది. వికారాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఓరల్ హైజీన్‌కి చాలా మంచిది. నాచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా పని చేస్తుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. బాడీ న్యూట్రియెంట్స్‌ని ఈజీగా అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది.
మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. అలర్ట్‌గా ఉండేలా చేస్తుంది. మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
మచ్చలను నయం చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
గర్భిణీలకు మార్నింగ్ సిక్‌నెస్‌ని తగ్గిస్తుంది. వికారాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఒత్తిడి తగ్గించి డిప్రెషన్ నుండి కోలుకునేలా చేస్తుంది.
అల్లం..
పొట్ట సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి వాటికి అల్లం ఎంతో ఫేమస్. ఇంకా దీనివల్ల కలిగే ప్రయోజనాలు...
కాన్స్టిపేషన్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి రిలీఫ్ ఇస్తుంది.
ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. తలనొప్పి, పీరియడ్ పెయిన్ వంటి వాటికి ఇది మంచి మందు.
మార్నింగ్ సిక్‌నెస్‌ని తగ్గిస్తుంది. కాన్సర్ కీమోథెరపీ వల్ల వచ్చే వికారాన్ని కూడా తగ్గిస్తుంది.
మంచి ఆకలి పుట్టిస్తుంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది.
ఇంన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.
దంత వ్యాధుల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది.
జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది.
గ్యాస్ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేస్తుంది.
సర్జరీ నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది.
ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి.
కొత్తిమీర..
ఒక కట్ట కొత్తిమీర బుట్టలో వేయకుండా కూరగాయలు కొనడం పూర్తవదు. అంత పాప్యులర్ కొత్తిమీర మన ఇళ్ళల్లో. కొత్తిమీర వేసిన సాంబారు రుచీ, పరిమళం అందరికీ తెలిసిందే. ఈ కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్‌ని తగ్గిస్తుంది.
అరుగుదలకు బాగా పని చేస్తుంది. కొత్తిమీరలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ.
కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి మీద ఒత్తిడి తగ్గిస్తుంది. విజన్ డీజెనరేటివ్ ఎఫెక్ట్స్‌ని రివర్స్ చేయగలదు.
ఓరల్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. నోటి పుండుని త్వరగా తగ్గిస్తుంది.
ఎముకలకి బలాన్నిస్తుంది. బోన్ రీ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది.
మెన్స్ట్రువల్ క్రాంప్స్‌ని తగ్గిస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండేలా చేస్తుంది.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అల్జైమర్స్, కాన్సర్, డయాబెటీస్ వంటి వాటిని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తుంది.
కొత్తిమీర యాంటీ-ఎలర్జిక్ కూడా. ఫంగస్, బ్యాక్టీరియా నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది.
ముఖంపై నల్లమచ్చను నివారిస్తుంది.
చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.