Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రిజ్ నుంచి చాలాసార్లు వాసన రావడం సహజమే. చాలారోజుల పాటు ఆహారాన్ని, ఇతరత్రా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో వుంచకుండా చూసుకోవాలి. కుళ్లిన వస్తువుల వాసన ఇతర వస్తువుల వాసనతో కలిపి దుర్వాసన వ్యాపిస్తుంది. తరచుగా కొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లో చాలా రోజుల పాటు వుంచడం సరికాదు. ఇదే ఫ్రిజ్ వాసనకు కూడా కారణమవుతుంది. కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఎలాగంటే..?
సోడా ఉంచండి: ఫ్రిజ్ నుండి వాసన వస్తుంటే ఓ గిన్నెలో బేకింగ్ సోడా తీసుకొని ఫ్రిజ్‌లో ఉంచండి. వాసన ఉండదు.
పొదీనా రసం: పొదీనా వాసన తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. అందుచేత పుదీనాను ఫ్రిజ్‌లోని కుండలో ఉంచవచ్చు లేదా ఫ్రిజ్‌ను శుభ్రపరిచేటప్పుడు రసం ఉపయోగించవచ్చు. అదేవిధంగా, నారింజ రసం కూడా ఉపయోగించవచ్చు.
కాఫీ గింజలు: కాఫీ బీన్స్‌కు ఫ్రిజ్‌లో దుర్వాసనను దూరం చేస్తాయి. ఈ గింజలను ఓ గిన్నెలో తీసుకొని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. దాంతో దుర్వాసన పోయి కాఫీ వాసన వస్తుంది.
పేపర్: ఫ్రిజ్‌లో వాసనతో ఇబ్బంది పడుతుంటే కాగితపు కట్టను ఫ్రిజ్‌లో ఉంచండి. వార్తాపత్రిక వాసన సులభంగా గ్రహిస్తుంది.
నిమ్మకాయ: వాసనలు తొలగించడానికి నిమ్మకాయను కూడా ఉపయోగిస్తారు. నిమ్మకాయలోని పుల్లని వాసన ఫ్రిజ్ నుండి దుర్వాసనను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయను సగానికి కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇది దుర్వాసనను దూరం చేస్తుంది.