Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరుగు కేవలం శరీరానికి మాత్రమే వ్యాయమం కాదు... మైండ్‌కి కూడా అది ఎంతో మేలు చేస్తుంది. ఆ మేలు ఏమిటో మనమూ తెలుసుకుందాం...
రన్నింగ్ వల్ల వెంటనే మన మూడ్ మారుతుంది, ఎనర్జీ వస్తుంది. రన్నింగ్ చేసే వాళ్ళు రోజుని ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు.
రన్నింగ్ చక్కని యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుంది. ఒత్తిడిగా అనిపిస్తే ఓ ఇరవై నిమిషాలు పరుగు పెట్టండి చాలు. ఉత్సాహంగా ఉంటారు.
రోజువారీ ఒత్తిడిని తట్టుకోవటానికి అవసరమైన శక్తిని రన్నింగ్ ఇస్తుంది. ప్యానిక్, అతి ఆలోచన తగ్గి ప్రశాంతంగా ఉండొచ్చు.
ప్యానిక్ ఎటాక్స్, యాంగ్జైటీ డిసార్డర్ వంటి వాటిని తగ్గించడంలో కూడా రన్నింగ్ సహాయం చేస్తుంది.
రన్నింగ్ మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది.
చేసే పని మీద ఫోకస్ పెరుగుతుంది.
పరుగు వల్ల సృజనాత్మకత కూడా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
పరుగు బ్లడ్ ప్రెజర్‌ని రెగ్యులేట్ చేస్తుంది.
రన్నింగ్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
ముప్ఫై నిమిషాల రన్నింగ్‌తో పాటు వార్మప్, స్ట్రెచింగ్ కలుపుకుంటే సుమారు నలభై ఐదు నిమిషాలు అవుతాయి. ఇవన్నీ కలిసి మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి.
ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంటారు.
రెగ్యులర్‌గా రన్నింగ్ చేసేవారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుందనీ, వారి బాడీ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుందనీ రీసెర్చర్స్ చెబుతున్నారు.
పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడానికి రన్నింగ్ బాగా హెల్ప్ చేస్తుంది.
పరుగు వల్ల ఇంఫర్మేషన్ని అర్ధం చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం బాగా తేలిక అవుతాయి అంటున్నారు నిపుణులు.
జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
ప్రతికూల ఆలోచనలు, పరిస్థితులతో రెగ్యులర్‌గా రన్నింగ్ చేసే వారు బాగా డీల్ చేయగలుగుతారు.
రన్నింగ్ వల్ల బోలెడన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి.
త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. నిద్ర మధ్యలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి.
రన్నింగ్ వల్ల బ్రెయిన్లో ఫ్రెష్ గ్రే మ్యాటర్ పెరుగుతుంది. అంటే కొత్త విషయాలని చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు.
ఆరోగ్యకరమైన ఆహారం మీద దృష్టి పెరుగుతుంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆగిపోతుంది. అన్ని వైపులనించీ ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.
సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది.
లైఫ్‌లో హెల్దీ ఛాయిసెస్ తీసుకుంటారు.
అసలు నీరసం అనే పదమే మీ డిక్షనరీలో నుండి వెళ్ళిపోతుంది, మీరెప్పుడూ ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటారు.
నాచురల్ ఎన్విరాన్మెంట్లో పరుగు పెట్టడం వల్ల మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని పరిశోధకులు తెలియ చేస్తున్నారు.
తక్కువ డిస్ట్రాక్షన్స్కి లోనయ్యి, చేస్తున్న పని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టగలుగుతారు.
రెగ్యులర్‌గా రన్నింగ్ చేసే వారు బాగా కమ్యూనికేట్ చేయగలరనీ, వారి ఎమోషన్స్‌ని చక్కగా వ్యక్తీకరించగలరనీ తెలుస్తోంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది.
రెగ్యులర్ రన్నింగ్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి.
మీతో మీరు ఎక్కువ సమయం గడపగలుగుతారు.
అధిక బరువు అన్న సమస్యే ఉండదు.
ఎముకలు బలంగా ఉంటాయి.
జీవిత కాలం కూడా పెరుగుతుంది.
రన్నింగ్ వల్ల కామన్ కోల్డ్ వంటి సమస్యలకి పూర్తిగా దూరమవుతారు.
రన్నింగ్ వల్ల లక్ష్య సాధన తేలీకవుతుంది అంటున్నారు నిపుణులు.
రన్నింగ్ వల్ల మీ సోషల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.