Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువ సేపు కూర్చుంటే... పొట్ట ముందుకు సాగి కొవ్వుతో ఉబ్బిపోతుంది. నడుం చుట్టూకొవ్వు పేరుకుంటుంది. ఈ ఆరు చిట్కాలు పాటించి కొవ్వు కరిగించుకోమని డాక్టర్లు చెబుతున్నారు.
షుగర్ ఉన్న ఆహారాలు తింటే బరువు పెరుగుతారు. అందులోని ఫ్రక్టోజ్ పొట్టలో కొవ్వు తయారయ్యేలా చేస్తుంది. లివర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి... వీలైనంతవరకు పంచదారను తగ్గించేయండి. పంచదార ఉండే డ్రింగ్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, టెట్రా జ్యూస్, బిస్కెట్లు, కేకులు, డెసెర్టుల వంటివి తగ్గించేయండి.
ప్రోటీన్ అనేది వేడిగా ఉంటుంది. ప్రోటీన్ ఉండే ఏ పదార్థం తిన్నా బాడీలో వేడి పెరుగుతుంది. దాంతో కొవ్వు ఐస్‌క్రీమ్‌లా కరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ ఉండే పప్పులు, బద్దలు, బాదం వంటివి తీసుకోండి. అయితే ప్రోటీన్‌తో జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువైతే వేడి చేసి గొంతులో గరగర వచ్చి ఆ తర్వాత జలుబు, దగ్గు వంటివి మొదలవుతాయి. కాబట్టి బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ తీసుకోవాలి.
ఏమీ చెయ్యకుండా బరువు తగ్గడం సాధ్యం కాదు. కాబట్టి వీలైనన్ని పనులు చెయ్యండి. ఇందుకోసం పార్కులకో, జిమ్ములకో వెళ్లక్కర్లేదు. ఇంట్లోనే చెయ్యాల్సిన పనులు చాలా ఉంటాయి. బూజు దులుపుకోవచ్చు, టీవీలు, ఫ్రిజ్‌లను తుడవొచ్చు, మొక్కలు, గార్డెన్ పని చెయ్యవచ్చు, నీళ్లు పట్టొచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, గదులు క్లీన్ చేసుకోవచ్చు, కారు తుడుచుకోవచ్చు,... ఇలా మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే సరిపోతుంది... పైగా ఇలా చేస్తే చాలా త్వరగా కొవ్వు కరిగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా చేస్తూనే... పిండి పదార్థాలు తక్కువగా తీసుకుంటే మంచిదంటున్నారు.
ఫైబర్ అంటే పీచు పదార్థం. జామకాయల లాంటి వాటిలో ఉంటుంది. మనం తినే ఆకు కూరలు, కూరగాయల్లో ఉంటుంది. ఇది బాగా తింటే కొవ్వు కరిగేలా చేస్తుంది. ఫైబర్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పొట్టలో అంతా క్లీన్ చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఫైబర్ బాగా లభించే ఆహారం ఎక్కువ తినాలి.
నడవడం, స్విమ్మింగ్ చెయ్యడం, వేగంగా నడవడం వంటివి కూడా పొట్టను తగ్గిస్తాయి. వీలు చూసుకొని రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళ ఓ గంట నడిచేలా ప్లాన్ వేసుకోండి. వీలైతే రన్నింగ్ కూడా చెయ్యండి. ఒకేసారి కొవ్వు కరిగిపోవాలని అనుకోవద్దు. అలా ఎప్పుడూ జరగదు. నెమ్మదిగానే కరుగుతుంది. అలాగే కరగనివ్వాలి. అదే ఆరోగ్యానికి మంచిది కూడా.
నీరు తాగాలి అనే విషయం మనకు గుర్తుండదు. పనుల్లో పడి మర్చిపోతాం. డాక్టర్లేమో అదే విషయాన్ని పదే పదే చెబుతారు. పని చేసే చోట ఓ బాటిల్లో నీరు ఉంచుకొని కనీసం రెండు గంటలకు ఓసారైనా తాగుతూ ఉండాలి. అలా ప్రతి 25 కేజీల బరువుకూ లీటర్ నీరు తాగాలి. సపోజ్ మీరు 50 కేజీల బరువు ఉంటే... రోజూ 2 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. మీరు 75 కేజీల బరువు ఉంటే కనీసం 3 లీటర్ల నీరు రోజుకు అవసరం. ఇవన్నీ సింపుల్ టిప్సే... జాగ్రత్తగా ఫాలో అయితే కచ్చితంగా కొవ్వు కరిగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.