Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి మొటిమలు, బ్లాక్ హెడ్స్ మీద పూయాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. కొన్నాళ్లు ఇలా చేస్తే అవి పూర్తిగా మాయమైపోతాయి. మచ్చలు కూడా మిగలవు.
దాల్చిన చెక్కను పొడి చేసి కొద్దిగా తేనె, కాసింత ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిలో ఎగ్ వైట్ కలిపి జుత్తుకీ, మాడుకీ పట్టించాలి. పావుగంట సేపు అలా ఉంచి తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు వదిలిపోతుంది. జుత్తు బలంగా, పొడవుగా పెరుగుతుంది.
పెట్రోలియం జెల్లీలో దాల్చిన చెక్క పొడి కలిపి పెదవులను బాగా రుద్దుకుంటే పగుళ్లు మానిపోతాయి. డెడ్ స్కిన్ తొలగిపోయి పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి.
దాల్చినచెక్క పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు కాస్త చల్లారి గోరువెచ్చగా అయ్యాక పుక్కిలిస్తే నోటి దుర్వాసన వదిలిపోతుంది.
గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆలిరు, నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి... ఇందులో పాదాలు ముంచాలి. పదిహేను నిమిషాలు అలా ఉంచిన తరువాత రుద్ది కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే పాదాలు పగలకుండా స్మూత్‌గా ఉంటాయి. ఆల్రెడీ పగుళ్లు ఉంటే మూసుకుపోతాయి. ప