Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని చాలా దేశాలలో అభిప్రాయం ఉంది. కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని అయితే వీరి అనారోగ్య సమస్యకు, కొన్ని సామాజిక సమస్యలు ఎదుర్కుంటున్నారని స్త్రీలు చాలా తక్కువ జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారన్నది వాస్తవం. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపడం వల్లే కొన్ని అనారోగ్య సమస్యలలో చిక్కుకుంటున్నారని ఓ నివేదికలో పేర్కొన్నారు. స్త్రీ లపై శారీరక హింస లైంగిక వేదింపులకు గురి అవుతున్నారని ముఖ్యంగా హెచ్ఐవి, ఊపిరి తిత్తుల సమస్యలు ఎదుర్కుంటున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలలో చాలామంది యువతులు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవాళ్ళు గర్భం వచ్చినప్పుడు బిడ్డను ప్రసవించినప్పుడు లేదా ఆ తరువాత మరణిస్తున్నారని గమనించవచ్చు.
అభివృద్ధి చెందుతున్న చెందిన దేశాలలో పొగాకు వాడకం క్రమంగా పెరగడం గమనించవచ్చు. పురుషుల కంటే మహిళలు పొగతాగే వారిసంఖ్య 10 రేట్లు పెరిగింది. స్త్రీలు మహిళలు యువతులే లక్ష్యంగా పొగాకు ఉత్పత్తుల ప్రచారం జరగడం దురదృష్ట కరం. యుక్త వయసు నుంచే సిగరెట్ల వాడకం క్రమంగా పెరుగు తోంది. ఈ వ్యసనం నుంచి మహిళలు లేదా యువతులు తగ్గించుకుని విజయం సాధించిన వారి సంఖ్య పెరుగు తోంది. నేకోటిన్ ప్రత్యామ్నాయ థెరఫీ ప్రభావం తక్కువే అని నిపుణులు తేల్చారు.
కరోనా ప్యాండమిక్‌లో ఆఫ్రికాలోని మహిళలు హెచ్ఐవి బారిన పడిన వారు దాదాపు 61శాతం అరేబియన్ మహిళలో వైరస్ బారిన పడ్డ వారు 43శాతం లాటిన్ అమెరిక, ఆశియా, తూర్పు యూరప్‌లో క్రమంగా పెరుగుతున్నారు. మహిళలు స్త్రీలపై పెరుగుతున్న హింస అనారోగ్యానికి కారణం అవుతుంది. ప్రపంచంలో 15శాతం నుండి 71శాతం మహిళలు శరీరక దాడులు లైంగిక దాడులు పాల్పడుతున్నది వారి భాగస్వాములే అని తేలింది. పురుషుల వల్లే ఆర్ధికంగా, సామాజికంగా మహిళలు వేదనకు గురికావడం శారీరక హింసకు గురి కావడం వల్లే అనారోగ్యం పాలవుతున్నారని, శరీరంపై గాయాలు అవాంఛిత గర్భం హెచ్ఐవి ఇతర సుఖ వ్యాధులు, దీర్ఘ కాలీక ఒత్తిడికి గురి అవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై ముఖ్యంగా 15 సంవత్సరాల వయసులో హింసకు గురి అవుతున్నారు. ప్రతి 5 గురు మహిళల్లో ఒక్కరు లైంగిక వేదింపులకు గురి అవుతున్నారు.
ఇన్ని శతాబ్దాలు దాటినా అభివృద్ధి చెందిన దేశాలలో బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు బాలికలు. ఒక అంచనా ప్రకారం 8 సంవత్సరం నిండక ముందే పెండ్లి చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా బాలికలలో శారీరక అంశాలపై అవగాహన లేక పోవడం వల్లే హెచ్ఐవి వంటి రోగాల బారిన పడుతున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలా మంది యుక్త వయసులో ఉన్న పిల్లలలో 14 మిలియన్ల మంది ప్రతిసంవత్సర తల్లులుగా మారుతున్నారని, అందులో 90శాతం మంది తల్లులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండడం ఆవేదన కలిగిస్తోంది.
ప్రతిరోజూ 1600 నుంచి 10,000 మంది మరణించిన శిశువులు గర్భంలోనే చనిపోవడం గమనించ వచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డలు 90శాతం, గర్భిణీలు పురుడు పోసు కోకుండానో, పురుడు పోసుకున్నాకో చనిపోతున్నారు.
పురుషుల కన్నా మహిళలు ఆదాయం సంపాదించే వారైతే వారు పంజరంలో ఇరుక్కు పోతున్నారు. గర్భ వతులైన మహిళలలో, పిల్లలలో మాలేరియా బారిన పడిన సంఘటనలు ఉన్నాయి.
పురుషుల కంటే స్త్రీలలో 50శాతం ఊపిరి తిత్తుల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా దేశాలలో ఇప్పటికే మహిళలు వంటింటికే పరిమితం కావడం వల్ల వంటింట్లో వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ప్రపంచంలోని 1/2 మిలియన్ స్త్రీలలో సంవత్సరానికి 1.3 మిలియన్ల మరణాలు కేవలం ఊపిరి తిత్తుల వ్యాధులతో మరణి స్తున్నారు.
పురుషుల కంటే స్త్రీలు వినికిడి సమస్యలు బాధపడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలబారిన పడుతున్నారు. స్త్రీ ఆరోగ్యం విషయంలో విచక్షణ గమనించవచ్చు. పురుషులతో పాటు సమానంగా ఆకాశంలో సగం అంతరిక్షంలో సగం అన్న పదాలు... ఆచరణలో మాత్రంలో వివక్ష చూపుతున్నారు. పురుషులతో పాటు సమానంగా కంటిసమస్యకు చికిత్స అందక పోవడం స్త్రీలలో శస్త్ర చికిత్స విషయంలో వివక్ష ఇలా అన్నింటా కోనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మహిళల ఆరోగ్యానికి చర్యలు తీసుకోడం అత్యవసరం.