Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కానీ దాన్ని వాడకుండా రోజు గడవదు. కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని వాటి నుండి రక్షిస్తాయి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే...
- ఫోన్‌ని మీ శరీరం నుండి దూరంగా పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్స్ యూజ్ చేయండి. ఫోన్‌ని ఎప్పుడూ మీ పాకెట్లోనే పెట్టుకునే అలవాటుకి స్వస్తి చెప్పండి.
- నిద్రపోతున్నప్పుడు రేడియేషన్ తగ్గించడానికి సెల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్లో అలారం, ఫ్లాష్ లైట్ యూజ్ చేయవలసిన అవసరం వుంటే కనీసం ఫ్లైట్ మోడ్‌లోకి మార్చుకోండి.
- ఫోన్‌ని దిండు కిందా, మీ తలకి దగ్గరగానో పెట్టుకోవడం పూర్తిగా మానేయండి. బెడ్‌సైడ్ టేబుల్ మీద ఫోన్ పెట్టుకునే అలవాటు చేసుకోండి.
- చాలా సేపు ఫోన్లో మాట్లాడడం తగ్గించండి. మెసేజెస్ వాడడం అలవాటు చేసుకోండి. ప్రస్తుతం మెసేజింగ్ యాప్స్ విరివిగా లభిస్తున్నాయి. కాబట్టి ఇదొక ప్రాబ్లం కాకపోవచ్చు.
- కార్లు, బస్సులు, రైళ్ళు, లిఫ్టులు వంటి ప్రదేశాల్లో మొబైల్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాల్లో సెల్ ఫోన్ వాడకం వీలున్నంతగా తగ్గించండి.
- సిగల్ వీక్‌గా ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయకండి. ఎందుకంటే ఇలాంటప్పుడు ఎలెక్ట్రో మ్యాగెటిక్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
- పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి, ఇచ్చినా స్క్రీన్ టైంని కంట్రోల్ చేయండి.