Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధ్యతలంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. పోషకాహారాన్ని తీసుకోరు. తగినంత వ్యాయామం చేయరు. దాంతో బరువు పెరుగుతారు. దీనివల్ల మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టాలి.
విటమిన్ లోపం ఏ వయసులోనైనా రావొచ్చు. నలభైల్లో పడిన తర్వాత విటమిన్ డి లోపం ఏర్పడితే ఎముక సాంద్రత తగ్గి అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీయొచ్చు. అంతేకాదు ఆందోళనా, కాలానుగుణంగా వచ్చే ఇబ్బందులూ ఎదురుకావొచ్చు. అలాగే ఐరన్, రైబోఫ్లావిన్, విటమిన్-బి తక్కువ కాకుండా చూసుకోవాలి.
కొందరు రాత్రిపూట చాలా ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. ఈ సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. అలాంటప్పుడు పిండి పదార్థాలు దండిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అది అరగడానికి చాలా సమయం పడుతుంది. కొందరిలో అరగదు కూడా. దాంతో బరువు పెరుగుతారు. మరో విషయం.. నలభై దాటిన వారు బరువు తగ్గడం కాస్త కష్టమే. ప