Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతాయి. సాధారణంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలు, రోగనిరోధక తక్కువగా ఉండే వ్యక్తులు ఈ సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. అసలే కరోనా కాలం. మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి వారిని సీజనల్ వ్యాధుల నుంచి రక్షించవచ్చు. అందుకే రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి ఆహారంలో ఈ పండ్లు, కూరగాయలను చేర్చండి.
బ్రకోలీ: బ్రకోలీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని సల్ఫోరాఫేన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దీనితో పాటు, ఐరన్, ఇతర ముఖ్యమైన పోషకాలు విరివిగా లభిస్తాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బీట్రూట్: బీట్రూట్లో అనేక ఆరోగ్యకమైన పోషకాలుంటాయి. పొటాషియం, ఇతర మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తపోటును తగ్గించడానికి, సమతుల్యమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బీట్రూట్ క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పుట్టగొడుగులు: పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు బాగా ఉపయోగపడతాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
నారింజ: నారింజ పండు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. శరీరంలో ఐరన్‌ను పెంచుతుంది. రక్తహీనతతో బాధపడేవారు ఆరెంజ్ పండ్లు తినాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు.
పెరుగు: రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పెరుగు అద్భుతమైన ఆహార పదార్థం. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జలుబు తీవ్రతను తగ్గిస్తుంది. ఇది ప్రోటీన్లలో కూడా సమృద్ధిగా లభిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడానికి పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. ప