Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం దాదాపు అందరి ఉద్యోగ జీవితాల్లోనూ కంప్యూటర్ ఓ భాగమైపోయింది. అందులోనూ కరోనా నేపథ్యంలో చాలామంది మహిళలు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ఇలా విధుల్లో భాగంగా రోజుకు గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్‌ను చూస్తూనే పని చేయడం మన కండ్లపై ప్రభావం చూపిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలో కంటి సంబంధిత సమస్యలను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం..
20-20-20 సూత్రాన్ని తప్పనిసరిగా పాటించండి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కండ్లకు తగినంత విశ్రాంతినివ్వండి. ఆ సమయంలో కండ్లను సవ్య, అపసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పాలి. లేదంటే కండ్లను మూసి ఉంచాలి.
చాలామంది కనురెప్ప వేయకుండా కండ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే కండ్లు పొడిబారి, మంట పెడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి.
కండ్లు, మానిటర్ పైభాగం ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానిటర్ మధ్య భాగానికి, కండ్లకు 15 నుంచి 20 డిగ్రీల కోణం ఉంటుంది. ఫలితంగా కండ్లు ఎటువంటి ఒత్తిడికి గురవ్వవు.
కండ్లకూ, కంప్యూటర్ స్క్రీన్కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండాలి.
దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి.
మానిటర్ పై వెలుగు పడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలుపుల నుంచి స్క్రీన్‌పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు ఉపయోగించాలి. స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మన కంటికి సరిపోయే రీతిలో అమర్చుకోవాలి.
గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటి వల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఫాంట్సైజు పెంచుకోవాలి.
ముఖానికి ఎదురుగా ఫ్యాన్ పెట్టుకోవద్దు. గాలి వల్ల కూడా కండ్లు తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.
కంప్యూటర్ పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కండ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా.